kumaram bheem asifabad- పరిశీలించి.. సూచనలు చేసి..
ABN , Publish Date - Jun 26 , 2026 | 10:28 PM
మండలంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కోలాం కోటారి గ్రామంలో క్షేత్ర పర్యటన చేసి ఓటరు ఫారాల పంపిణీని పరిశీలించిచారు.
కెరమెరి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కోలాం కోటారి గ్రామంలో క్షేత్ర పర్యటన చేసి ఓటరు ఫారాల పంపిణీని పరిశీలించిచారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అలాగే బీఎల్‌వోలు ఎన్ని ఫారాలు ఓటర్లకు అందజేశారు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ నాగార్జున గౌడ్, సర్పంచ్ శాంతాబాయి తదితరులు ఉన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు డౌనల్ ఏరియాలో చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. వివరాలు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ రహీముద్దీన్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తహసీల్దార్ రామ్మోహన్‌రావు మండలంలోని రెబ్బెన కొత్తగూడ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఓటరు ఎన్యుమరేషన్ పారంల పంపిణీ పరిశీలించారు. ఆయన వెంట ఇన్స్‌పెక్టర్ తిరుపతి, రవికుమార్ తదితరులు ఉన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)ను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో సర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎల్‌వోలు ఇంటింటి వెళ్లి సంబంధిత ఫారాలను పంపిణీ చేస్తారని చెప్పారు. ఓటర్లు వాటిని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యువరాజ్, వార్డు సభ్యులు కొండయ్య, గులాబ్‌రావు, సంపత్, నితిన్, సంతోష్, నీలాబాయి తదితరులు పాల్గొన్నారు.