Share News

kumaram bheem asifabad- పరీక్షల సమయం.. ఎండలతో పైలం

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:07 PM

పరీక్షల కాలం మొదలైంది. అటు ఎండలు సైతం మండుతున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి. ఈ సారి పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. ప్రతీ పరీక్షకు 3 నుంచి 5 రోజుల గ్యాప్‌ పీరియడ్‌ను కల్పించింది. దీంతో నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి ప్రారంభం నుంచే తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉండ డంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. సక్రమంగా ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒ

kumaram bheem asifabad- పరీక్షల సమయం.. ఎండలతో పైలం
ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులు

- జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన

వాంకిడి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పరీక్షల కాలం మొదలైంది. అటు ఎండలు సైతం మండుతున్నాయి. ఈ నెల 14 నుంచి ఏప్రిల్‌ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి. ఈ సారి పరీక్ష విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. ప్రతీ పరీక్షకు 3 నుంచి 5 రోజుల గ్యాప్‌ పీరియడ్‌ను కల్పించింది. దీంతో నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి. మార్చి ప్రారంభం నుంచే తీవ్రమైన ఎండలు, వడగాలులు ఉండ డంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. సక్రమంగా ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక పక్క పరీక్షలు మరోవైపు ముదురుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

- నీరసం రాకుండా..

రేకుల షెడ్లు వెంటిలేషన్‌ సరిగా లేని గదుల్లో పరీక్ష రాసే విద్యార్థులు అప్ర మత్తంగా ఉండాలి. ఎండలో వడదెబ్బ బారిన పడితే నీరసంతోపాటు దాని ప్రభావం మెదడుపైనా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డ్రిగ్రీలు దాటినప్పుడు అధిక వేడి తగులుతుంది. నీరు చెమట రూపంలో శరీరం బయటకు వెళ్తుంది. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు చెప్తున్నారు. కాగా ఎండలు, వడగాలుల కారణంగా విద్యార్థులు వడదెబ్బ బారినపడి అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. పరీక్షలకు వెళ్లే ముందు నీళ్ల సీసా వెంట తీసుకెళ్లాలి. మధ్యమధ్యలో నీళ్లు తాగకుంటే డీహైడ్రేషన్‌కు గురవుతారు. 24 గంటల వ్యవధిలో 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఎండలో వెళ్తే టోపీ, గొడుగు వాడాలి. కళ్లజోడు పెట్టుకోవాలి. విద్యార్థులు తేలికపాటి, లేతరంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. కూల్‌డ్రింక్స్‌, చెరుకు రసం, జ్యూస్‌లు, ఐస్‌ కలిపిన పానియాలు తాగొద్దు. నూనె పదార్థాలు, వేపుళ్లు, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్స్‌ తీసుకోకూడదు.

- ఇలా చేయాలి..

కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలి. వీటిలో శరీరానికి నీటితో పాటు ఖనిజ లవణాలు అందుతాయి. ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, ఉండేలా చూసుకోవాలి. దోసకాయ, పుచ్చకాయ, సలాడ్ల వంటివి తీసుకోవాలి. సొరకాయ, బీరకాయ, వంటి నీటిశాతం ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవడంతో శరీరంలో డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవచ్చు. కనీసం 7, 8 గంటలు నిద్రపోవాలి.

- వడ దెబ్బకు గురైతే..

- వడ దెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని ఆస్పత్రికి తీస కెళ్లాలి.

- ప్రథమ చికిత్సలో భాగంగా వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశంలోకి చేర్చాలి. చల్లని ఫ్యాన్‌ గాలి తగిలేలా చూడాలి. తడి క్లాత్‌తో తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు తుడవాలి.

- ఉప్పు కలిపిన మజ్జిగ లేదా. ఉప్పు కలిపిన గ్లూకోస్‌ నీరు. ఓఆర్‌ఎస్‌ వాటర్‌తాగించాలి.

- ఒక వేళ వడ దెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి చేరిన వ్యక్తికి నీరు తాగించరాదు.

- వీలైనంత తొందరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.

తేలికపాటి పదార్థాలు తీసుకోవాలి..

డాక్టర్‌ వినోద్‌, వాంకిడి వైద్యాధికారి

విద్యార్థులకు పరీక్షల కాలంలో తేలికంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. భోజనంలో పీచు, కార్బోహైడ్రేట్లతో కూడిన పదా ర్థాలు ఉండేలా చూసుకోవాలి. మసాలా వంటకాల జోలికి పోవద్దు. తరచూ నీరు తాగక పోతే శరీర ఉష్ణోగ్రత సమతుల్యత దెబ్బతింటుంది. విద్యార్థులు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated Date - Mar 10 , 2026 | 11:07 PM