Share News

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా!

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:16 AM

భూ కుంభకోణం కేసులో అరెస్టయి.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈవోడబ్ల్యూ పోలీసులకు వింత సమాధానాలు చెప్తున్నట్లు తెలిసింది.

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా!

  • పోలీసుల విచారణలో బ్రహ్మనాయుడు జవాబులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): భూ కుంభకోణం కేసులో అరెస్టయి.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈవోడబ్ల్యూ పోలీసులకు వింత సమాధానాలు చెప్తున్నట్లు తెలిసింది. నకిలీ జీవోల సృష్టి, రికార్డుల తయారీ, సంతకాల ఫోర్జరీకి సంబంధించి పోలీసులు ప్రశ్నించగా.. తనకు తెలియదని, గుర్తులేదని, మర్చిపోయానని విచారణకు సహకరించకుండా దాటవేసే ధోరణిలో సమాధానాలు చెప్తున్నాడని తెలిసింది. ముఠాలో కీలకంగా వ్యవహరించిన అతడి తమ్ముడు రమేశ్‌, లాయర్‌రాధాకృష్ణ, ఇతర వ్యక్తులతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర సాంకేతిక అంశాలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, 9.28 ఎకరాల భూ కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? అనే కోణంలో పోలీసులు గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - Jun 18 , 2026 | 06:16 AM