kumaram bheem asifabad- పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 10 , 2026 | 10:29 PM
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాం గం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో బుధవారం నిర్వ హించే మున్సిపల్ పోరుకు అదికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 28 పోలింగ్ బూత్ లను అదికారులు ఏర్పాటు చేశారు.
- అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు
- ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో 50 వార్డు స్థానాలు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాం గం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో బుధవారం నిర్వ హించే మున్సిపల్ పోరుకు అదికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 28 పోలింగ్ బూత్ లను అదికారులు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళా శాలలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. కాగజ్‌నగర్ పట్టణంలోని డీఏవీ పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో బయలుదేరి వెళ్లారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు 85 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. మొత్తం 50 వార్డు కౌన్సిలర్ స్థానాలకు పో లింగ్ నిర్వహించడానికి అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆసిఫాబాద్ పరిధిలో 13,927 మంది, కాగజ్‌నగర్ పరిధిలో 51,205 మంది ఓటర్లు ఉండగా జిల్లాలో రెండు మున్సిపాలిటీలలో 65,132 మంది పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.
- బరిలో 224 మంది అభ్యర్థులు
జిల్లాలో ఆసిపాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డులలో మొత్తం 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ ఆదృష్టాన్ని పరిక్షీంచుకోనున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులలో మొత్తం 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది, బీఆర్‌ఎస్ నుంచి 20 మంది, బీజేపీ నుంచి 18 మంది, బీఎస్పీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఒకరు, జనసేన నుంచి ఎనిమిది, స్వతంత్రులు 22 మంది బరిలో ఉన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులలో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 29 మంది, బీఆర్‌ఎస్ నుంచి 30 మంది, బీజేపీ నుంచి 30 మంది, బీఎస్పీ నుంచి ఎనిమిది, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు, ఇతర పార్టీల నుంచి ముగ్గురు, స్వతంత్రులు 23 మంది పోటీలో నిలిచారు.
- 500 మంది సిబ్బంది
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలి టీ పరిధిలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం 500 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నా రు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 28 పోలింగ్ కేంద్రాలు ఉండగా రిజర్వు సిబ్బందితో కలుపుకొని 39 మంది పీవోలు, 41 మంది ఏపీవోలు, 80 మంది ఓపీవోలు ఎన్నికల విధులకు కేటాయించా రు. అలాగే కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 85 పోలింగ్ కేంద్రాలకు 85 మంది పీవోలు, 85 ఏపీవోలు, 170 మంది ఓపీవోలు మొత్తం 340 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు నియమిం చారు. జరిగింది. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగ జ్‌నగర్ మున్సిపాలిటీలలో జరిగే ఎన్నికల సంద ర్భంగా 800 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు లో పాల్గొననున్నారు. ఇందులో డీఎస్పీ స్థాయి అధికారులు నలుగురు, సీఐలు,ఆర్‌ఐలు 12 మంది, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు 38 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు 120 మంది, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌లు 516 మంది, హోంగార్డులు 75 మంది, అటవి, ఫైర్ ఇతర శాఖల సిబ్బంది 47 మంది బందోబస్తులో పాల్గొననున్నారు.
- జిల్లాలో 65,132 మంది ఓటర్లు
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలి టీల పరిధిలో 65,132 మంది ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 13,927 మంది ఓటర్లు ఉండగా ఇందులో 6822 మంది పురుషులు, 7103 మంది మహిళలు ఇద్దరు ఇత రులు ఉన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధి లో మొత్తం 51,205 మంది ఓటర్లు ఉండగా ఇందు లో 25,004 మంది పురుషులు, 26,193 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికలకు అధికారులకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 30 వార్డుల్లో ఎన్నికలు ప్రశాతంగా, స్వేచ్చగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్ డేవిడ్ ఎన్నికల సిబ్బందికి విధులను కేటాయించి రూట్ మ్యాప్‌లను అందజేశారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రితో పాటు 85 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది మంగళవారం ఉదయం బయలు దేరారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద మౌలిక వసతులు, బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులను కూడా మోహరించారు. ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ నికితాపంత్ సూచించార