Share News

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:39 PM

వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతేలు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
కలెక్టరేట్‌ అవరణలో మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న కలెక్టర్‌

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): వాతావరణ సమతుల్యత పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతేలు కోరారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీశాఖ అధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణలతోపాటు జిల్లా అధికారులు హాజరై మొక్కలు నాటి నీళ్లుపోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీలు మాట్లాడు తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్‌, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌ పాషా, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

సిరిసిల్ల అర్బన్‌ : జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, అన్‌లోడింగ్‌లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యంసేకరణ , అపెరల్‌పార్క్‌, రైస్‌ మిల్లులు, గోదాంలలో అన్‌లోడింగ్‌ వేగవంతం చేయడం, అన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ, పురోగతి అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సహాకార, గ్రామీణాభివృద్ధి మెప్మా, రవాణా ఇతర శాఖల అధికారులతో టెలికాన్‌పరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం ఉన్న బస్తాలను వెంటనే అపెరెల్‌ పార్క్‌, రైస్‌ మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫోర్ట్‌ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు

Updated Date - Jun 01 , 2026 | 11:39 PM