Share News

ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 10:46 PM

ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలకు సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలి
వాసవీ మాతకు పూజలు చేస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ దంపతులు

-కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలకు సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో మనశ్శాంతి, ఆరోగ్యం చేకూరుతుతుందన్నారు. ఉదయం కుంకుమపూజ, సాయంత్రం ఊరేగింపు, పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్‌ దంపతులకు దేవాదాయ శాఖ అధికారి, ఆల య అర్చకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే సమీకృత కలెక్టరేట్‌ కార్యా లయంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత జయంతి వేడుకల్లో అధికారులు వాసవీ మాత జయంతి వే డు కలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలన అధికారి రాజేశ్వర్‌, జిల్లా అధికారులు దు ర్గా ప్రసాద్‌, హన్మంతరెడ్డి, సునీల్‌, ఆర్యవైశ్య ప్రముఖులు రాజేశం, హరీస్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, రాజేశం, వంశీకృష్ణ, వాసవీ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

జన్నారం: మండలంలో ఆర్యవైశ్యుల కులదైవం వాసవిమాత జయంతి వేడుకలను ఆర్యవైశ్యులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో అభయాంజనేయ సహిత మహాలక్ష్మిదేవాలయంలో ప్రత్యేక పూజ లు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పొన్కల్‌ సర్పంచ్‌ జక్కు సుష్మ భూమేష్‌లతో పాటు మండల ఆర్య వైశ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు గోపాల క్రిష్ణ, వామన్‌, రమేశ్‌్‌, జయరామకృష్ణ, సత్తయ్య, నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 10:46 PM