Share News

పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:36 PM

పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహ కరించాలని, కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో శుభ్రత-పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని
32వ డివిజన్‌లోని తీగల్‌పహాడ్‌ రాంనగర్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మేయర్‌ దర్ని మధుకర్‌లు

పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత...

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహ కరించాలని, కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో శుభ్రత-పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కార్పొరేషన్‌లోని 32వ డివిజన్‌లో మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటి మే యర్‌ సల్లా రమ్య, కమిషనర్‌ అన్వేష్‌లతో కలిసి ‘శుభ్రత-ప్రతీ ఒక్కరి ఆరోగ్య భద్రత’ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ప్రారంభించారు. 32వ డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో ప ర్యటించి పారిశుధ్య, నీటి సరఫరా, విద్యుత్‌ దీపాలు, మురుగు కాలువలు, రహ దారుల సమస్యలను తెలుసుకున్నారు. తీగల్‌ పహాడ్‌ పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహ కరించాలని, ఈ కార్యక్రమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూ రు చేశాయన్నారు. 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా కార్యచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచా యతీల్లో పారిశుధ్య పనుల చేపట్టనున్నాట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జనన, మరణ, భవన నిర్మాణాల, ఇతర దృవ పత్రాలకు సంబందించిన ఫైళ్లను క్లియ రెన్స్‌ కోసం అన్ని చర్యలు చేపట్టమన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం చేస్తూ అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఇంటి నుంచి సేక రించిన తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌ యార్డ్‌కు తరలించాలన్నారు. ము న్సిపల్‌ మేయర్‌ ధర్ని మధుకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా అభివృద్ధి ప్రణాళికను రూపొందించామన్నారు. డివిజన్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధి పనులకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేశా మన్నారు. 60 డివిజన్లలో సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయ డంతో పాటు అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొ రేటర్లు, స్థానిక నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:36 PM