పట్టణ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:10 PM
పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ న్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ న్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జరుగుతు న్న డ్రైనేజీ పనులను ఆయన ప రిశీలించారు. ఆయన మాట్లాడు తూ పట్టాణంలోని కాలనీలలో ఉన్న సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. కాలనీలలో ఉన్న ప్ర ధాన సమస్యలు డ్రైనేజీ సీసీ రోడ్లు వేసేందుకు త్వరలో రూపకల్పన చేశామన్నారు. కాలనీలలో అధికారులు సమస్యలు లేకుండా చూడాలని మునిసిపల్ సిబ్బందికి ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత
మన్ననూర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : పు లుల గణనకు వెళ్లి గుండె పోటుతో మృతి చెం దిన ప్రొటక్షన్ వాచర్ దాసరి శ్రీనివాసులు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. గురువా రం అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామం లో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశా రు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కుటుం బానికి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా మన్ననూరులోని ఆర్‌డీటీ సంస్థ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందిస్తు న్న వైద్యసేవలను తెలుసుకున్నారు. ఎఫ్‌డీ డా క్టర్ సునిల్‌హిరామత్, డీఎఫ్‌వో రేవంత్‌చంద్ర, మన్ననూరు సర్పంచ్ పాల్గొన్నారు.