Share News

రక్తదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:27 PM

రక్తదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌ పిలు పునిచ్చారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సేవా కార్యక్రమా లను నిర్వహిస్తున్నామని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పేర్కొన్నారు.

రక్తదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి
రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందిస్తున్న మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

మంచిర్యాలక్రైం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : రక్తదానానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌ పిలు పునిచ్చారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సేవా కార్యక్రమా లను నిర్వహిస్తున్నామని, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగం గా మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అ మరవీరులు ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా మరింత అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశ్యంతో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల ప్రాణాల ను కాపాడేందుకు పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను అర్పించి నట్లే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడంతో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరి స్థితులు, క్లిస్టమైన శస్త్ర చికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరం అవుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడంలో ఇం డియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నా రు. మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృ షి చేసిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ రావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ బాధ్యులు డాక్టర్‌ రెడ్డి, మహేందర్‌తో పాటు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్ర మోద్‌రావు, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ మహేందర్‌, సీనియర్‌ మెంబర్‌ మధుసూదన్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ మం చిర్యాల ప్రెసిడెంట్‌ వెంకటేశ్వర్లు, ట్రెజరర్‌ రావు, లయన్‌ డాక్టర్‌ సుగు ణాకర్‌రెడ్డి, పోలీసులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:27 PM