చట్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:12 PM
చట్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండడంతో పాటు వాటి గురించి తెలుసుకోవాలని మహిళలకు సంబంధించి గృహ హింస తదితర చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల సీనియర్ సివిల్‌్ జడ్జీ ఎం. నిర్మల తెలిపారు.
సీనియ్ సివిల్ జడ్జి ఎం. నిర్మల
మందమర్రిటౌన్,జూలై4(ఆంధ్రజ్యోతి): చట్టాల గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగిఉండడంతో పాటు వాటి గురించి తెలుసుకోవాలని మహిళలకు సంబంధించి గృహ హింస తదితర చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల సీనియర్ సివిల్‌్ జడ్జీ ఎం. నిర్మల తెలిపారు. శనివారంస్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన లీగల్ అవర్నేస్ ఉచిత న్యాయ సేవా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోక్సో చట్టం మారకద్రవ్యాలు, భూ వివాదాలు, గృహ హింస, మహిళల భద్రతకు సంబంధించి చట్టాలు ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన సమయంలో ముందు జాగ్రత్త న్యాయం ఎలా పొందాలో వివరించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకొని అవసరమైనప్పుడు జిల్లా లీగల్ అథారిటి ద్వారా తెలుసుకోవ చ్చునన్నారు. సమాజంలో తప్పు చేసిన వారికి చట్టపరమైన శిక్షలు ఉంటాయని మరిచిపోవద్దన్నారు. ఎప్పుడు కూడ న్యాయస్థానంలో దోషులు తప్పించుకోలేరని ఆమే పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది నేరాలు రుజువై శిక్షలు పడిన సందర్భాలు అనేకమని తెలిపారు. మంచి సమాజ నిర్మాణమని ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మొబైల వ్యాన్ ద్వారా దృశ్య్ప ప్రదర్శన ఏర్పాటు చేసి ఉచిత న్యాయ వ్యవస్థా, న్యాయ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మంచిర్యాల బార్ అసోసియేషన్ కొత్త సత్తయ్య,చీఫ్ లీగల్ ఏరియా డిఫెన్స్ కౌన్సిల్ ఎండీ సందాని, మున్సిపల్ సిబ్బంది, పాల్గొన్నారు