Share News

kumaram bheem asifabad- జిల్లా ప్రథమ మహాసభలకు తరలిరావాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:32 PM

ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌కుమార్‌ కోరారు. రెబ్బెనలో ఉపాఽధి హామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న కాగజ్‌నగర్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో జిల్లా ప్రథమ మహాసభలను ఏర్పాటు చేస్తున్నాని తెలిపారు. ఈ సభలకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు

kumaram bheem asifabad-  జిల్లా ప్రథమ మహాసభలకు తరలిరావాలి
మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ఆనంద్‌కుమార్‌

రెబ్బెన, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌కుమార్‌ కోరారు. రెబ్బెనలో ఉపాఽధి హామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న కాగజ్‌నగర్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో జిల్లా ప్రథమ మహాసభలను ఏర్పాటు చేస్తున్నాని తెలిపారు. ఈ సభలకు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నూతన చట్టంలో రోజుకు రెండు సార్లు ఫొటోలు తీయాల్సి వస్తోందన్నారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తు తాయని వివరించారు. ఉపాఽధి హామీ పని స్థలాల్లో తాగునీటిరు, కనీస వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత విధానంలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని కోయవాగులో చేపడుతున్న ఉపాధి హామీ పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల విధానం కొత్త చట్టంతో పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పాత విధానంలో కొనసాగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jun 13 , 2026 | 11:33 PM