Share News

kumaram bheem asifabad- ప్రతీ ఓటు కీలకమే..

ABN , Publish Date - Feb 10 , 2026 | 10:38 PM

మున్సిప ల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకం కానున్నది. ఒక్క ఓటు సైతం గెలుపోటము లను ప్రభావి తం చేసే అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు బుధవారం జరుగనుండడంతో ఆయా పార్టీల నాయకులు సోమవారం రాత్రి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, నగదు పంపిణీతో పాటు కొన్ని ప్రాంతాల్లో చీరలను కూడా ఓటర్లకు అందజేశారు.

kumaram bheem asifabad- ప్రతీ ఓటు కీలకమే..
లోగో

- పోలింగ్‌ చిట్టీలతో పాటు మద్యం, డబ్బు పంపిణీ

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రతీ ఓటు కీలకం కానున్నది. ఒక్క ఓటు సైతం గెలుపోటము లను ప్రభావి తం చేసే అవకాశం ఉంటుంది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు బుధవారం జరుగనుండడంతో ఆయా పార్టీల నాయకులు సోమవారం రాత్రి నుంచి గుట్టు చప్పుడు కాకుండా ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, నగదు పంపిణీతో పాటు కొన్ని ప్రాంతాల్లో చీరలను కూడా ఓటర్లకు అందజేశారు. పోటాపోటీగా ఉన్న వార్డుల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు పంపిణీ చేస్తున్నారు. కూడలి ప్రధాన కేంద్రాలను బిందు వుగా చేసుకొని డబ్బు, మద్యం, ప్రలోభాలు చూపుతూ లోపల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రమాణాలు చేయిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల అన్ని పార్టీల నుంచి వచ్చిన డబ్బులు ఓటర్లు తీసుకోవడంతో చివరకు ఎవరు ఎవరికి ఓటేస్తారన్నది తెలియక నేతలు తీవ్ర టెన్షన్‌కు గురవుతున్నారు. ఎన్నికల రోజుల ఓటింగ్‌ సరళిపై అనిశ్చితి నెలకొంది. కొందరు పార్టీల నాయకులు తమ పార్టీకే ఓటేయాలని ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపఽథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి.

- వీలున్నన్ని మార్గాల్లో..

వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా రు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గత మూడు రోజులుగా 30 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయా పార్టీల నాయకులు నిత్యం డబ్బులు ఇచ్చి ఓటర్లను ర్యాలీలో పాల్గొనేలా చర్యలు తీసుకుం టున్నారు. సోమవారం రాత్రి నుంచి కుల సంఘాల నాయకులతో మంతనాలు జరిపి, కులస్థుల ఓట్లేసేలా చూడాలని ఆయా పార్టీల నాయకులు జోరుగా చర్చలు జరిపారు. అలాగే బరిలో ఉండే కొంత మంది స్వతంత్ర అభ్యర్థులను డమ్మి చేసేందుకు కూడా చర్చలు జరిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పోటీలో నిలిపింది. కానీ కాంగ్రెస్‌ మాత్రం 29 వార్డులోనే అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాత్రం తాము ఇందిరమ్మ ఇళ్లు చేస్తాం, వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకుంటూ ప్రచారం చేశారు. కాగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభి వృద్ధిని చూపుతూ అన్ని వార్డుల్లో కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేట్టు ప్రసంగాలు చేశారు. మద్యం, డబ్బులు ఓటర్లకు అంతా అందజేస్తుండడంతో ఎవరికి పట్టం కడుతారన్నది ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు టెన్షన్‌ పెట్టిస్తోంది. కొన్ని పార్టీల నాయకులు సర్వేలు చేస్తున్నారు, ఓటమి అంచుల ఉన్న వాటిపై మరింత దృష్టి పెట్టి పెద్ద నాయకులు పట్టు కోల్పోకుండా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఎన్నికల స్థాయి తుదిఘట్టానికి చేరుకుంది. ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది శుక్రవారం వెల్లడ య్యే ఫలితాల్లో తేలనుంది.

Updated Date - Feb 10 , 2026 | 10:38 PM