Share News

kumaram bheem asifabad- నీటిని పొదుపుగా వాడితేనే జీవకోటికి మనుగడ

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:02 PM

అడవులను రక్షిస్తూ నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడే భావితరాలకు మనుగడ సాధ్యమవుతుందని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని స్థానిక చెలిమెలవాగు ప్రాజెక్టులో విద్యార్థులతో కలిసి నీటి ఆదాపై సమీక్ష సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- నీటిని పొదుపుగా వాడితేనే జీవకోటికి మనుగడ
జల సంరక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులు

తిర్యాణి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అడవులను రక్షిస్తూ నీటిని పొదుపుగా వాడుకున్నప్పుడే భావితరాలకు మనుగడ సాధ్యమవుతుందని జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని స్థానిక చెలిమెలవాగు ప్రాజెక్టులో విద్యార్థులతో కలిసి నీటి ఆదాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులు రక్షిస్తేనే వర్షాలు బాగా కురిసి జిల్లా సిరిలు పారుతాయని అన్నారు. రసాయనికి మందుల వల్ల నీరు కలిసితంగా మారి ప్రజలకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయని అటవీ పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా చెలిమెల వాగు ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకొని అడవులను కాపాడుకుంటే భవిష్యత్‌ తరాలకు మనుగడ ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టులు బొంగుతో తయారు చేసిన ఆకర్షణీయ కట్టడాల ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు, సర్పంచ్‌లకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని సాలెగూడ గ్రామ పంచాయతీ మిషన్‌ భగీరథ ఈఈ సిద్దికి అధ్యక్షత జల మహోత్సవంలో భాగంగా ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమానికి స్థానిక సర్పంచ్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని భవిష్యత్తు తరాలకు సమృద్ధిగా నీటిని అందించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. నీటి వనరులను సరిగ్గా వినియోగించాలన్నారు. భూగర్భజలాలను పెంచే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో మౌనిక, సర్పంచ్‌ వందన, కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:02 PM