Share News

kumaram bheem asifabad- ప్రతీ ప్రయాణం సురక్షితం కావాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:06 PM

ప్రతీ ప్రయాణం సురక్షితం కావాలని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. మంగళవారం కెరమెరి మండలం ఆగర్‌వాడా గ్రామంలో అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, గ్రామస్థుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సైందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్తుల చొరవతో గ్రామంలో 100 హెల్మెట్లు పంపిణీ చేయాలని సంకల్పం తీసుకోవడం అభినందనీయమన్నారరు. ప్రతి ద్విచక్ర వవాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

kumaram bheem asifabad- ప్రతీ ప్రయాణం సురక్షితం కావాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ నితికా పంత్‌

కెరమెరి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ప్రయాణం సురక్షితం కావాలని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. మంగళవారం కెరమెరి మండలం ఆగర్‌వాడా గ్రామంలో అరైవ్‌- అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, గ్రామస్థుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సైందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్తుల చొరవతో గ్రామంలో 100 హెల్మెట్లు పంపిణీ చేయాలని సంకల్పం తీసుకోవడం అభినందనీయమన్నారరు. ప్రతి ద్విచక్ర వవాహనదారుడు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. చిన్న పిల్లలు ప్రయాణించే సమయంలో కాకుండా హెల్మెట్‌ ధరింపజేయాలని ఎస్పీ సూచించా రు. అలాగే వాహనంపై వెనక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరంచడం అత్యంత అవసరమని తెలిపారు. వ్యక్తి గత భద్రతా జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివార ణకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. రాంగ్‌రూట్లలో వాహనదా రులు ప్రయాణించి ఆపద కొనితెచ్చుకోవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి కుటుంబానికి ఇబ్బందులు కలిగేలా ప్రయాణిలు చేయవద్దని ఎప్పీ చెప్పారు. ఒకరు చేసిన తప్పు వద్ద ప్రమాదాల్లో గాయపడి, మృతి చెందిన సమయంలో చాలా కుటుంబాలు అవస్థలు పడాల్సిన పరిి స్థతులు సైతం చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు. అనంతరం గ్రామస్తులతో కలిసి రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటిస్తామని, ప్రమాదా లను నివారిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో గ్రామస్తుల బైక్‌ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్‌, సర్పంచ్‌ రోజాసోనాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:06 PM