ప్రతీ ఇంటికెళ్లి అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:25 PM
బీఎల్‌వోలు ప్రతీ ఇంటికె ళ్లి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్/ కందనూలు/ తాడూరు, జూ న్ 30 (ఆంధ్రజ్యోతి) : బీఎల్‌వోలు ప్రతీ ఇంటికె ళ్లి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని క లెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తాడూ రు ఎస్సీ కాలనీలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కా ర్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూ మరేషన్ ఫారాన్ని ప్రతీ ఓటరు తప్పనిసరిగా పూర్తి చేసి బీఎల్ వోలకు అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని పక్షంలో ఓ టరు జాబితాలో పేరు నమోదు కాకపోవచ్చనే అంశాన్ని ప్రతీ కుటుంబానికి స్పష్టంగా వివరిం చాలని బీఎల్‌వోలను కలెక్టర్ ఆదేశించారు. ఎర్రోళ్ల నాగమణి అనే మహిళ కలెక్టర్‌ను కలిసి తనకు ప్రస్తుతం పూరిగుడిసె మాత్రమే ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెండవ విడతలో కచ్చితంగా ఇల్లు మం జూరు అవుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. తా డూరు తహసీల్దార్ రామకృష్ణ, ఎన్నికల విభా గం అధికారులు, రెవెన్యూ అధికారులు, బీఎల్‌వో విజయ ఉన్నారు.
రెండు రోజుల్లో పూర్తి చేయాలి
జిల్లాలోని ప్రతీ ఓటరుకు బూత్ స్థాయి అధికారుల ద్వారా ఎన్యుమరేషన్ ఫారా ల పంపిణీని రానున్న రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పా టిల్ తహసీల్దార్లను ఆదేశించా రు. మంగళవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహ సీల్దార్లతో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓట రు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాల సేకర ణ పురోగతి మండలాల వారీగా పురోగతిని కలె క్టర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 7,31,632 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,82,116 మంది ఓటర్లుకు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు పంపిణీ చేశారని తెలిపారు. ఈ స మావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్ వో పాండు, ఆర్డీవోలు బన్సీలాల్, జనార్దన్‌రెడ్డి, యాదగిరి, తహసీల్దార్లు, ఎన్నికల శాఖ అధికా రులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.
రైతులతో కలిసి వీక్షించిన కలెక్టర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని నాగర్‌కర్నూల్ మండలం మంతటి గ్రామంలో రైతు వేదికలో రైతులతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం వీక్షించారు. జిల్లాలో మూడు లక్ష ల 43వేల మంది రైతులకుగాను రూ.423 కోట్లు రైతు భరోసా 9 రోజుల పాటు దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు కలెక్టర్ వీ క్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధి కారి చంద్రశేఖర్, సర్పంచ్ వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నా యకులు పాల్గొన్నారు.