అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:56 PM
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర కార్మిక,గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని నందనంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
భీమారం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర కార్మిక,గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని నందనంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో మంత్రి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రా బోయే రోజుల్లో ఓటు హక్కు కల్పించే విధంగా నిరంతరం కృషి చేస్తుం దన్నారు. ఇందులో భాగంగా సర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తున్నారని, ఫారం నెంబరు 6, 8కి సంబంధించిన అంశాలు ఫామ్‌లో ఎలా నింపాలి తదితర అంశాలపై ప్రజల కు అవగాహన లేకపోవడంతో గంగరగోళానికి గురవుతున్నారని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటరు లిస్టు సవరించేందుకు సైతం ఫారం నెంబర్ 8 అందుబాటులో ఉందని, దీన్ని నింపి ఎన్యుమరేషన్ ఫారంతో కలిపి ఇస్తే కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే దగ్గర ఉంటాయని తెలి పారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రాజేందర్‌లు బందోబస్తు చేపట్టారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పిన్నింటి రఘునాధ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పోడేటి రవి, నాయకులు శ్రీనివాస్, మహేష్‌రెడ్డి, సత్తిరెడ్డి, తిరుపతి, అచ్చన్న, బీఏల్‌ఏలు అమర్‌సింగ్ నాయక్, రవి, కిరణ్యబాబు పాల్గొన్నారు.