Share News

kumaram bheem asifabad- ప్రతీ చుక్క కీలకమే

ABN , Publish Date - Nov 13 , 2026 | 10:37 PM

ఎల్‌నినో ప్రభావంతో వర్షాపాతంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. నేపథ్యంలో నీటి వనరరుల పరిరక్షణపై ఇప్పటి నుంచే దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తలో తాగునీటి కొరత ఏర్పడ కుండా ముందస్తు ప్రణాళికలు రూపొం దించుకోవాలి.

kumaram bheem asifabad- ప్రతీ చుక్క కీలకమే
లోగో

- ఎల్‌నినో నేపథ్యంలో పొంచి ఉన్న జలగండం

వాంకిడి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాపాతంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. నేపథ్యంలో నీటి వనరరుల పరిరక్షణపై ఇప్పటి నుంచే దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తలో తాగునీటి కొరత ఏర్పడ కుండా ముందస్తు ప్రణాళికలు రూపొం దించుకోవాలి. మరోవైపు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించు కోవా ల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. వాహనాల శుభ్రత, భవన నిర్మాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్‌ప్లాంట్లు, పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో నీటిసరఫరా వ్యవస్థలో నీటి వినియోగాన్ని సమీక్షించాలి. ఎక్కడ ఎంత ఖర్చువుతుంది ? ఎంత వృథా అవుతోంది ? పొదుపు నకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ? అనే అం శాలపై అధికారులు దృష్టి సారించాలి. నీటిని పొదుపు చేయడం అంటే వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయడం కాదు. అవసరానికి మించి వాడకుండా, వృథాను అరికట్టి ప్రత్యామ్నా య మార్గాలను అనుసరించడమే లక్ష్యం కావాలి. ఇందుకోసం కేంద్ర జలసంఘం, భూగర్భ జల సంస్థ పలు మార్గదర్శకాలు ఇచ్చింది.

- ప్రపంచాన్ని..

ఎల్‌నినో ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఓ ప్రకృతి విపత్తు. దీని ఫలితంగా తీవ్ర వర్షాభావ పరిస్థి తులు ఏర్పడి గడ్డుకాలం ఎదురవుతోంది. మున్ముందు తీవ్ర జలగండం పొంచి ఉందన్న హెచ్చరికలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ చుక్కా కీలకంగానే మారుతుంది. నీటి వృథాను అరికడితే కొరత నుంచి కాస్తయినా ఉపశమనం దక్కే అవకాశా లున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నగరాలు, పట్టణాల్లో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటో లు, జీపులు, లారీలు, డీసీఎంలు, వ్యాన్ల శుభ్రతకు పెద్ద మొత్తంలో నీరు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పైపుల ద్వారా నీరంతరం నీటిని వదులుతు వాహనా లు కడగడంవల్ల అవసరానికి మించి ఖర్చు వుతోంది. ఉదాహరణకు ఒక కారును పైపుతో కడగడానికి 150 లీటర్ల నీరు వినియోగిస్తే అదే నీటితో 55 లీటర్ల చొప్పున ఇద్దకిరిపైగా వ్యక్తుల రోజువారీ సరఫరా అవసరాన్ని తీర్చవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో సర్వీసింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా కార్లు, బైక్‌ షోరూం సర్వీసింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

- హోటళ్లు, రెస్టారెంట్లలో..

హోటళ్లు, రెస్టారెంట్లలో వంట, పాత్రల శుభ్రత, గదు ల నిర్వహణ, మరుగుదొడ్లు, లాండ్రీ లాంటి అవస రాలకు నీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా కుళాయి లను తెరచి ఉంచడం, పాత్రలను నిరంతరం ప్రవహిం చే నీటితో శుభ్రం చేయడం, తువ్వాళ్లు, దుస్తులను అవసరానికి మించి ఉతకడం వల్ల నీటి వినియోగం పెరుగుతుంది. జిల్లాలో హోటళ్లు, రెస్తారెంట్లు దాదాపు 500లకు పైగా ఉన్నాయి. ఇవి కాకుండా అల్పాహార బండ్లు, టిఫిన్‌ సెటర్లు, పాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు అదనంగా ఉన్నాయి. కేంద్ర భూగర్భ జల అథారిటీ అందుబా టులో ఉంచిన భవనాల నీటి అవసరాల మార్గదర్శకాల ప్రకారం.. త్రీ స్టార్‌ వరకు హోటళ్లలో వంటగది, టాండ్రీ, సిబ్బంది అవసరాలు, ఇతర నీటి వినియో గాలను మినహాయించి ఒక్కొక్కరికి రోజుకు సుమారు 180 లీటర్ల అవసరాన్ని ప్రామాణికంగా చెబుతు న్నారు. 4 స్టార్‌ అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లకు ఈ పరిమాణం 320 లీటర్లు. రెస్టారెంట్లలో ఒక్కో సీటుకు రోజుకు 70 లీటర్లు నీటి అవసరాన్ని సూచిం చారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నీటి వినియోగంపై ఆడిట్‌ నిర్వహించేలా పోత్రహించాలి. నీటి లీకేజీలు, అధిక వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. నిబంధనలకు అనుగుణంగా మురునీటి శుద్ది వ్యవస్థ లు పనిచేస్తున్నాయో లేదో పరిశీలించారు. శుద్దిచేసిన నీటిని ఫ్లషింగ్‌, తోటల నిర్వహణ, ఇతర అనుమ తించిన అవసరాలకు వినియోగించేలా చూడాలి.

- వాటర్‌ ప్లాంట్లపై పర్యవేక్షణ..

తాగునీటి శుద్ధి చేసి ప్యాకెజ్డ్‌ వాటర్‌గా విక్రయించే ప్లాంట్లలో ముడినీటిని శుద్ది చేయడం, ఫిల్టర్లను శుభ్రం చేయడం, రివర్స్‌ ఆస్మోసిన్‌ ప్రక్రియ, పరికరాల ప్రక్రియ, పరిసరాల నిర్వహణకు నీటిని వినియో గిస్తారు. ఈ ప్రక్రియల్లో వచ్చే వ్యర్థనీటిని సక్రమంగా నిర్వహించకపోతే నీటి వృథా పెరుగుతుంది. వాటర్‌ ప్లాంట్లలో నీటి వినియోగం వాటిఉత్పత్తి సామర్థ్యం, శుద్ది సాంకేతికత, రా వాటర్‌ నాణ్యత, నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. ప్లాంట్లలో రా వాటర్‌ వినియో గం, తుది ఉత్పత్తి, వ్యర్థ జలాల వివరాలను నమోదు చేయించాలి. అనుమతులు, వర్తించే నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్లు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. ఆర్‌వో ప్రక్రియలో వచ్చే నీటిని నాణ్యతను పరీక్షించిన తర్వాతే అనువైన ఇతర అవసరాలు వినియోగించే అవకాశాలను పరిశీలించాలి.

- కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం..

తడి వస్త్రం, బకెట్‌ పద్దతిలో శుభ్రం చేస్తే సుమారు 15-30 టీలర్లతో పని పూర్తి చేయవచ్చు ద్విచక్ర వాహ నాన్ని శుభ్రం చేయడానికి పద్ధతిని బట్టి సుమారు 10-30 లీటర్ల వరకు అవసరమవుతుంది. వాణిజ్య వాహన శుభ్రత కేంద్రాల్లో నిటీ వినియోగంపై తనిఖీ ు నిర్వహించాలి. నీటిని పునర్వినియోగం చేసే వాషింగ్‌ పరికరా లను పోత్రహించాలి. తాగునీటికి బదులుగా అందుబాటులో ఉన్న శుద్దిజచేసిన పునర్వి నియోగ నీటిని ఉపయోగించేలా ప్రోత్సహించాలి.

Updated Date - Nov 13 , 2026 | 10:37 PM