Share News

సర్‌లో ప్రతి అంశాన్ని నమోదు చేయాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:45 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి

సర్‌లో ప్రతి అంశాన్ని నమోదు చేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, అధికారులు

సిరిసిల్ల అర్బన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియలో ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సర్‌ ప్రక్రియపై జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా, పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ ప్రక్రి యకు సంబంధించి ఏదైనా సమాచారం అడిగిన వెంటనే వివరాలు అందించేందుకు అవసరమైన రికార్డులు, ఆధారాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్లను చేర్చడానికి లేదా తొలగించడానికి సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను తప్పనిసరిగా భద్రపరచాలని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ వారం చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. అనర్హులుగా గుర్తించిన దరఖాస్తులకు సంబంధించి సరైన కారణాలు, తగిన డాక్యు మెంట్లు, ఆధారాలను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఫారం- 6, 7, 8 దరఖాస్తుల పరిశీలనతోపాటు పెండింగ్‌ పనులను నవంబర్‌ 5వ తేదీ నాటికి పరిష్కరించాలని సూచించారు. ఈ దరఖా స్తులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఆధారాలను సక్రమంగా భద్రపరచాలని తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ఈ.ఆర్‌.ఓ, బి.ఎల్‌.ఓ. స్థాయిల్లో అన్ని రికార్డులు, డాక్యుమెంట్లను భౌతికంగా, ఆన్‌లైన్‌లో భద్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు సక్రమంగా నమోదయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపునకు సంబంధించి నిబంధనల ప్రకారం తగిన ఆధారాలు ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీఆర్‌ఓ జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కే ఎస్‌ బీ కుమారి, తహసీల్దార్‌ జయంత్‌, ఎలక్షన్‌ సెక్షన్‌ అధికారి రెహమాన్‌ తదితరులు ఉన్నారు.

దంపతులకు ప్రోత్సాహకాలు అందించిన కలెక్టర్‌

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న దంప తులకు ఎస్సీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో ప్రోత్సాహక ఫిక్స్డ్‌ బాండ్‌లను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అందజేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 16 మంది కులాంతర వివాహం చేసుకోగా వారికి రాష్ట్ర ప్రభు త్వం ప్రోత్సాహకం కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తులు చేసుకు న్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి ఒక్కో జంటకు మంజూరైన రూ 2లక్షల 50వేల చోప్పన ఫిక్స్డ్‌ బాండ్లను దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షే మాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:45 AM