ప్రతీ పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:40 PM
పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించా లని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ నాయకుడు జక్క రామస్వామి అన్నా రు.
- డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు జక్క రామస్వామి
అచ్చంపేటటౌన్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించా లని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ నాయకుడు జక్క రామస్వామి అన్నా రు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్లపేర్లను తొలగించే చర్యలకు కార కులైన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనా మా చేయాలని ఆయన డిమాండ్ చేశా రు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ను తొల గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరు ద్ధమని శనివారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా అరెస్టయిన కార్యకర్తల ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఎన్నిక ల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమా ర్‌ను తన పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. వివాదాస్పదంగా పే ర్కొంటు న్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి అర్హులైన ఓటర్లందరికి ఓటు హక్కు కల్పించాలని కోరా రు. కార్యక్రమంలో డీటీఎఫ్ నాయకులు విజ యమోహన్, పండు, రాములు, లక్ష్మీనారాయణ, మోతీలాల్, మురళి, జనార్దన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.