ప్రతీ చిన్నారికి చుక్కల మందు వేయాలి
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:29 PM
నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్ర మంలో 0-5సంవత్సరాలలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించా లని డివిజన్ ఉపఆరోగ్య అధికారి డాక్టర్ భీ మా నాయక్ పిలుపునిచ్చారు.
- డివిజన్ ఉప ఆరోగ్య అధికారి డాక్టర్ భీమా నాయక్
కల్వకుర్తి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్ర మంలో 0-5సంవత్సరాలలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించా లని డివిజన్ ఉపఆరోగ్య అధికారి డాక్టర్ భీ మా నాయక్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి పట్ట ణంలోని టీఎన్‌జీవో భవనంలో తోటపల్లి ప్రా థమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని వైద్య సిబ్బం ది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు ప ల్స్‌పోలియో చుక్కల పంపిణీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ తోటపల్లి పీహెచ్‌సీ పరిధిలో 20 పో లియో బూత్‌లు, ఒకసంచార బృందం ద్వారా మొత్తం 1928మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పిల్లలకు గతంలో పోలియో చుక్కలు వేసినా ఈ సారి కూడా తప్పకుండా వేయించాలన్నారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా ప్రతీ ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు కూడా ఆరోగ్య శాఖకు సహకరించి తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకొచ్చి చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి వైద్యాధికారి డాక్టర్ శివకుమార్, డివిజన్ అధికారులు శ్రీనివాసులు, పర్వతాలు, ఆరోగ్య విస్తరణాధికారి ప్రసాద్, సూపర్‌వైజర్ శ్రీనివా సులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.