Share News

వానాకాలమొచ్చినా రైతు భరోసాకు దిక్కేలేదు

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:56 PM

వానాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ రై తాంగానికి రైతు భరోసా ఇవ్వ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తీగల సాగర్‌ విమ ర్శించారు.

వానాకాలమొచ్చినా  రైతు భరోసాకు దిక్కేలేదు
మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకుడు తీగల సాగర్‌

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తీగల సాగర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యో తి) : వానాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ రై తాంగానికి రైతు భరోసా ఇవ్వ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తీగల సాగర్‌ విమ ర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నాయకుల స మావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు లకు ఇవ్వాల్సిన రైతు భరోసా సరైన సమయా నికి ఇవ్వక పోవడంతో రైతులు అప్పులు తెచ్చి ఆర్థిక ఇబ్బందులకు గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల దగ్గర కొనుగోలు చేసిన మొక్క జొన్న పంటలకు సంబంధించిన డబ్బు లు నెలరోజులవుతున్నా వారి అకౌంట్‌లోకి జమ చేయ లేదని, వాటిని వెంటనే జమ చేయాలని డి మాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇ వ్వాల్సిన ఎరువుల కోటా తగ్గించడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రైతుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకో వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యద ర్శివర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాస్‌, దేశ్యానాయక్‌, ఆంజనేయులు, నాయకులు రామయ్య, నరసిం హ, ఎం.శ్రీనివాసులు, శంకర్‌ నాయక్‌, శివవర్మ, బాలస్వామి, అశోక్‌, అంతటి కాశన్న, నాగరాజు, సైదులు, హనుమంతు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 11:56 PM