దేశహితమే కేంద్ర బడ్జెట్ ధ్యేయం: ఈటల
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:03 AM
దేశహితమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): దేశహితమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ రూపొందిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఈటల న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. దేశ అభివృద్థి విషయంలో రాజీపడని ధోరణి బడ్జెట్‌లో కనిపిస్తోందన్నారు. ఉపాధికి, చేతివృత్తులకు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారని చెప్పారు. ఉపాధి హామీ పేరు మార్పుపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని అయితే గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.81 వేల కోట్లు పెడితే ఈసారి లక్షన్నర కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ కేటాయింపులతో గ్రామీణ పేదలకు మరింత ఉపాధి కలుగుతుందన్నారు.