Share News

-కొలువుదీరిన పాలక వర్గాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:43 PM

ము నిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగిం ది.

-కొలువుదీరిన పాలక వర్గాలు

-మునిసిపాలిటీల్లో ముగిసిన ప్రమాణ స్వీకారం

-జిల్లాలోని నాలుగు బల్దియాలు కాంగ్రెస్‌ కైవసం

-అంతర్గత కుమ్ములాటలతో క్యాతన్‌పల్లిలో వాయిదా

మంచిర్యాల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ము నిసిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగిం ది. ప్రమాణ స్వీకారోత్సవం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపి క ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసింది. దీంతో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసా గిన బల్దియాలకు కొత్త పాలక వర్గాలు వచ్చినట్ల యింది. మంచిర్యాల కార్పొరేషన్‌లో ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించగా, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో ఆయా మండలాల తహసీల్దార్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్‌ తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట మునిసిపాలి టీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. మునిసిపల్‌ ఎ న్నికల ఫలితాలలో మంచిర్యాల కార్పొరేషన్‌, చెన్నూరు, లక్షెట్టిపేట మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి స్పష్టమైన మెజారిటీ రావడంతో అవి మూడు బల్దియాలను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసు కుంది. మంచిర్యాల కార్పొరేషన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు సొంతం చేసుకుంది.

బెల్లంపల్లిలో ఎగిరిన కాంగ్రెస్‌ జెండా....

బెల్లంపల్లి మునిసిపాలిటీలో చివరి వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎ న్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సమానంగా సీట్లు రావడంతో చైర్మన్‌ పదవిని అలంకరించాలని రెం డు పార్టీల నాయకులు పట్టుబట్టారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అప్రమత్తమై ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్య ర్థులు ఐదుగురిని, బీజేపీ అభ్యర్థి మద్దతుతో పాటు ఎక్స్‌అఫిషియోగా ఎమ్మెల్యే కూడ గట్టడంతో కథ సు ఖాంతం అయింది. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 21కి చే రుకొని మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో ఎట్టకేలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను అధికార పార్టీ తన ఖాతాలో వేసుకుంది.

క్యాతన్‌పల్లిలో ఒకరోజు వాయిదా...

క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపికతోపాటు సభ్యుల ప్రమాణ స్వీకారం ఒకరోజు వాయిదా పడింది. ప్రమాణ స్వీకార సమయాన్ని ఎన్ని కల అధికారులు ఉదయం 11 గంటలుగా నిర్ణయిం చారు. 12.15 గంటల వరకు కూడా కాంగ్రెస్‌, బీఆర్‌ ఎస్‌, సీపీఐ సభ్యులు చేరుకోకపోవడంతో ప్రమాణ స్వీ కార కార్యక్రమం వాయిదా పడింది. మిత్ర పక్షాలైన బీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులను కాంగ్రెస్‌ నాయకులు స మయానికి రాకుండా అడ్డుకోవడంతో ఈ పరిస్థితి నెల కొందనే ప్రచారం జరుగుతోంది. 22 వార్డులున్న ము నిసిపాలిటీలో అధికార పార్టీకి 6, బీఆర్‌ఎస్‌కు 11, సీపీఐకి 4, స్వతంత్రులకు ఒక సీటు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో నిలవడానికి ఆ పార్టీ స్వయం కృపాపరాదమే కారణమన్న వ్యాఖ్యలు విని పిస్తున్నాయి. తిరిగి మంగళవారం సభ్యుల ప్రమాణ స్వీకారాణికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలి మేయర్‌గా యువకుడు...

మంచిర్యాల కార్పొరేషన్‌గా తొలి మేయర్‌గా 32 ఏళ్ల యువకుడైన నస్పూర్‌కు చెందిన మున్నూరుకాపు సా మాజిక వర్గానికి చెందిన ధరణి మధుకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిగ్రీలో బీఏ చదివిన ఆయన గతంలో ఒక పర్యాయం వ్యవసాయ సహకార సంస్థ డైరెక్టర్‌గా పని చేశారు. కాంగ్రెస్‌లో చురుకైన నాయకుడు, కలు పుగోలు వ్యక్తిగా పేరుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావుకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు కావడంతో ఆయనను మేయర్‌ పదవి వరించింది.

కార్పొరేటర్ల ప్రమాణస్వీకారోత్సవం

మంచిర్యాలక్రైం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ల స్వీకారం సోమవారం చేపట్టారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యా లయంలో అధికార ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్నికల పరిశీలకులు గంగాధర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్డీవో శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారమహోత్స వాన్ని నిర్వహించగా ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ఎ మ్మెల్యే ప్రేంసాగర్‌రావు హాజరయ్యారు. ఆర్డీవో, ఎన్నిక ల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తొలుత 60 మంది అ భ్యర్థులుతో కార్పొరేటర్లుగా ప్రమాణస్వీకారం చేయిం చారు. అనంతరం మొదటగా 14వ డివిజన్‌ అభ్యర్థి తూముల నరేశ్‌, 32వ డివిజన్‌ అభ్యర్థి ధరణి మధూ కర్‌ను మేయర్‌ ప్రతిపాదించారు. దీంతో 11వ డివిజన్‌ అభ్యర్థి సుధమల్ల హరిక్రిష్ణ, 21వ డివిజన్‌ అభ్యర్థి జో గుల సదానందం, 15వ డివిజన్‌ అభ్యర్థి చింతపండు శ్రీనివాస్‌, గంగావరపు వెంకటేశ్వర్లు, ఎండీ ఖలీద్‌లు బలపరుచగా ఆర్డీవో శ్రీనివాస్‌ ఐదు నిమిషాల సమ యంతో ఎవరైన నామినేషన్‌ వేయవచ్చునని సూచిం చారు. డీసీసీ మాజీ అధ్యక్షురాలు విప్‌ జారీ చేశారు. దీంతో నామినేషన్‌కు దరఖాస్తులు రాకపోవడంతో కాం గ్రెస్‌ అభ్యర్థులు మేయర్‌గా ధరణి మధుకర్‌ను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. అనంతరం 54వ డివిజన్‌ అభ్యర్థి సల్ల రమ్యను డిప్యూటి మేయ ర్‌గా సల్ల రమ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు.

Updated Date - Feb 16 , 2026 | 11:43 PM