kumaram bheem asifabadకొలిక్కి రాని ఈఎస్‌ఐ ఆసుపత్రి సమస్య
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:20 PM
కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి సమస్య ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆసుపత్రి భవన కాలపరిమితి ముగిసినట్టు రెండేళ్ల క్రితం ఈఎస్‌ఐ కార్పొరేషన్ కమిటీ తేల్చి చెప్పింది. కానీ ప్రత్యామ్నాయంగా మరో భవనంలోకి మార్చి ఈ ఆసుపత్రిని కూల్చివేయాలని సూచనలు కూడా చేసింది. భవనం మార్పు కోసం ఇప్పటికీ వెతికినా కూడా ఇంత వరకు సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ భవనాల్లోకి మారుద్దామంటే ఆసుపత్రిలోని పరికరాలు, సిబ్బంది, సామగ్రికే సరి పోవడం లేదు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
కాగజ్‌నగర్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి సమస్య ఇంకా కొలిక్కి రావడం లేదు. ఆసుపత్రి భవన కాలపరిమితి ముగిసినట్టు రెండేళ్ల క్రితం ఈఎస్‌ఐ కార్పొరేషన్ కమిటీ తేల్చి చెప్పింది. కానీ ప్రత్యామ్నాయంగా మరో భవనంలోకి మార్చి ఈ ఆసుపత్రిని కూల్చివేయాలని సూచనలు కూడా చేసింది. భవనం మార్పు కోసం ఇప్పటికీ వెతికినా కూడా ఇంత వరకు సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రభుత్వ భవనాల్లోకి మారుద్దామంటే ఆసుపత్రిలోని పరికరాలు, సిబ్బంది, సామగ్రికే సరి పోవడం లేదు. ప్రయివేటు భవనాలు చూసినా కూడా ప్రభుత్వం ఽనిర్ణయించిన అద్దె ధరకు, ప్రస్తుత మార్కెట్ అద్దె ధరకు పొంతన లేకుండా ఉండడంతో తరలింపు మరింత జాప్యం జరుగుతోం ది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల ఈ భవనంలో లీకేజీలు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. గత 50 ఏళ్లుగా ఈ ప్రాంత కార్మికులు ఎనలేని సేవలు అందించింది. 2014లో ఎస్పీఎం మిల్లు మూత పడడటంతో రెండేళ్ల పాటు కార్మికుల నుంచి కట్టాల్సి న ఈఎస్‌ఐ డబ్బులను కార్పొరేషన్‌కు కట్టలే దు. దీం తో వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది.
- కాలక్రమేణా..
కాలక్రమేణా ఈఎస్‌ఐ కార్డులు తగ్గి పోవడం, తదితర కారణాల వల్ల ఈ ఆసుపత్రిని తరలించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈఎస్‌ఐ కార్పొరేషన్ కమిటీ 2018లో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపింది. ఈ భవనం పరిస్థితులపై అధ్యా యనం చేసింది. అలాగే ఈఎస్‌ఐ ఉద్యోగులకు కేటార ుుంచిన క్వార్టర్లను కూడా పరిశీలించి క్వార్టర్లు కూలే దశకు ఉన్నాయని వెంటనే ఖాళీ చేయించాలని సిబ్బందికి నోటీసులను జారీ చేశారు. ఈ భవనం విషయంలో కూడా పూర్తి నివేదికలను అధికారులు కార్పొరేషన్‌కు పంపించారు. ఆసుపత్రి భవనం కూల్చివేయాలని సూచనలు జారీ చేస్తూ భవనాన్ని ఖాళీ చేయాలని సూచించింది. పక్కాగా భవనం దొరక పోవడంతో ప్రస్తుతం ఉన్న భవనంలోనే వైద్య చికిత్సలు అందిస్తున్నారు. లక్షలతో కూడిన విలువైన సామగ్రి ఈ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఆయా శాఖల డాక్టర్లు లేక పోవడంతో ఆశించిన స్థాయి వైద్య సేవలు నిలిచి పోయాయి. డాక్టర్లు కూడా అడపా దడపా వస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. ఈ సమస్యలతోనే కార్పొరేషన్ ఇక్కడి ఆసుపత్రిని తరలిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగు తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఆసుపత్రి భవిష్యత్తుపై వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.