Share News

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:02 AM

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌....

మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మహిళా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, మహిళా కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావ్‌, ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎర్రబెల్లి స్వర్ణ నేతృత్వంలో గడప గడపకూ తీసుకెళ్లాలని మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


కేటీఆర్‌వి పచ్చి అబద్ధాలు: చామల

హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుడితే కేటీఆర్‌కు ఎందుకంత అక్కసు అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పోటీ ప్రజెంటేషన్‌లో కేటీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరగని మూసీ అభివృద్ధి కాంగ్రెస్‌ హయాంలో జరుగుతున్నందుకు ఆయన భయపడుతున్నారా.. లేక మూసీ పరిసర ప్రాంతాల ప్రజలు మురికి కూపంలోనే ఉండాలని అనుకుంటున్నారా అని నిలదీశారు. మూసీ విషయంలో బీఆర్‌ఎ్‌సకు బీజేపీ నేతలు వంత పాడుతున్నారని మండిపడ్డార

Updated Date - Mar 16 , 2026 | 04:03 AM