Share News

డిస్కంలకు ఈఆర్‌సీ షాక్‌

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:09 AM

విద్యుత్‌ పంపిణీ సంస్థలకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌యాక్సె్‌స ద్వారా కరెంట్‌ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి...

డిస్కంలకు ఈఆర్‌సీ షాక్‌

  • అదనపు సర్‌చార్జీ 0.13 పైసలకే ఆమోదం

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ సంస్థలకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) షాక్‌ ఇచ్చింది. ఓపెన్‌యాక్సె్‌స ద్వారా కరెంట్‌ కొనుగోలు చేసే వినియోగదారుల నుంచి.. 2026-27 తొలి అర్ధవార్షికం(ఏప్రిల్‌1-సెప్టెంబరు30)లో యూనిట్‌కు 0.59 పైసల వసూలుకు అనుమతించాలని కోరుతూ పంపిణీ సంస్థలు పిటిషన్లు వేశాయి. అయితే 0.13 పైసల వసూలుకు మాత్రమే అనుమతినిస్తూ ఈఆర్‌సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావులు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇంత తక్కువగా ఛార్జీల వసూలుకు అనుమతించడం ఇదే ప్రథమం.

Updated Date - Mar 11 , 2026 | 05:09 AM