పూర్తి చికిత్సతో టీబీ నిర్మూలన
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:05 PM
క్షయ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి కాలం మందులు వాడడం ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు.
- డీఎంహెచ్‌వో కే కృష్ణ
కందనూలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : క్షయ వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తి కాలం మందులు వాడడం ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామ పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన క్షయ వ్యాధి పరీక్షా శిబిరాన్ని డీఎంహెచ్‌వో తనిఖీ చేసి పరిశీ లించారు. ఆయన మాట్లాడుతూ అనుమానిత క్షయ రోగుల కళ్లె శాంపిల్స్‌ను సేకరించి, పరీక్ష లు చేయించాలని తెలిపారు. అనంతరం పెద్ద ముద్దునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నెల 7 వరకు తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కా ర్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ భర త్ కుమార్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌వాణి, డీపీవో రేణయ్య, ఎంఎల్‌హెచ్‌పీ సాయిశ్రీ, పర్య వేక్షణ సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, ప్రత్యేక సిబ్బంది పాల్గొన్నారు.