పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:59 PM
:పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 12,16 వార్డుల్లో పర్యటించి పారిశుధ్య్ద పనులను పరిశీలించారు.
అదనపు కలెక్టర్ చంద్రయ్య
చెన్నూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) :పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 12,16 వార్డుల్లో పర్యటించి పారిశుధ్య్ద పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలతో పాటు వీధులను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడు తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలన్నారు. మురుగు కాలువల్లో దుకాణదారులు కార్టన్ బాక్సులు, ఇతర వ్యవర్ధాలను వేసి మురుగునీటి వ్యవస్థకు ఆటంకం కలిగించవద్దన్నారు. అలాగే ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం అందిస్తుందని లబ్దిదారులు బియ్యాన్ని అమ్ముకుంటే రేషన్ కార్డులను రద్దు చేస్తామన్నారు. ప్రజలకు సమస్యలుంటే నిర్భయంగా అధికారులకు తెలియజేయాలన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 8 వార్డుల పర్యటన పూర్తి అయ్యిందని, మిగిలిన 10 వార్డులను సందర్శిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మశ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్, మున్సిపల్ కమీషనర్ మురళీకృష్ణ, కౌన్సిలర్లు శంకర్, శివకృష్ణ, నాయకులు సుశీల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.