Share News

ఉత్సాహంగా ఫారెస్టు మారథాన్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:30 PM

జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీలో నిర్వహించిన ఫారెస్టు జాతీయ మారథాన్‌కు అపూర్వ స్పందన లభించిందని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు.

ఉత్సాహంగా ఫారెస్టు మారథాన్‌
జెండా ఊపి మారఽథాన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, అటవీ అధికారులు

-జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

హాజీపూర్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ఎంసీసీ క్వారీలో నిర్వహించిన ఫారెస్టు జాతీయ మారథాన్‌కు అపూర్వ స్పందన లభించిందని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు మారథాన్‌ను ఎమ్మెల్యేతో పాటు ఐటీడీఏ పీవో మంద మకరంద్‌, డిఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, డైరెక్టర్‌ శాంతారమ్‌ జెండా ఊపి ప్రా రంభించారు. ఈ మారథాన్‌ను హైద్రాబాద్‌కు చెందిన గ్రీన్‌ సెక్యూర్‌ ఫౌం డేషన్‌ సహకారంతో 30కే, 10కే, 5కే నిర్వహించారు. అడవుల ప్రాముఖ్యత, జంతువులు, అడవుల సంరక్షణతో పాటు ప్రకృతి అందాలపై ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారికి వివరించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన ప రుగులో రాష్ట్రంలోని పలువురు పర్యావరణ ప్రకృతిప్రేమికులతో పాటు త మిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక, రాష్ట్రాల నుంచే కాకుండా జర్మనీ ,ఆస్ర్టేలియా దేశాల నుంచి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీవో సంస్థల ప్రతినిదులతో పాటు ఫారెస్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

-భారీగా ఎంట్రీఫీజు

30క మారధాన్‌కు రూ. 1999, 10కే కు రూ. 899, 5కే కు రూ. 599 ఎం ట్రీ ఫీజు ఉండడంతో ఇంకా ఔత్సాహికులు తగ్గారని మారథాన్‌లో పాల్గొన లేకపోయారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తం లో ప్రచారం కల్పించినా కానీ విదేశీ పర్యాటకులు ఇద్దరే పాల్గొనడంపై అక్కడకు వచ్చిన ప్రకృతి ప్రేమికులు నిట్టూర్చారు.

Updated Date - Oct 11 , 2026 | 11:30 PM