kumaram bheem asifabad- గోపాలమిత్రల ఆమె ఆరోగ్యానికి భరోసా
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:33 PM
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా మహిళల ఆరగ్యానికి భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభు త్వం హెల్త్ మిషన్-100 పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు మహిళలకు ప్రత్యేక మైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సర్కార్ హెల్త్ మిషన్-100 పేరుతో 100 రోజుల బృహత్తర కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది.
- పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక వైద్య సేవలు
- జూన్ 12 వరకు ప్రత్యేక శిబిరాలు
- హెల్త్ మిషన్-100 పేరుతో కార్యాచరణ
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా మహిళల ఆరగ్యానికి భరోసా ఇస్తూ రాష్ట్ర ప్రభు త్వం హెల్త్ మిషన్-100 పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి చర్యలు తీసుకుంటోంది. ప్రజారోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిం చింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు మహిళలకు ప్రత్యేక మైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సర్కార్ హెల్త్ మిషన్-100 పేరుతో 100 రోజుల బృహత్తర కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ప్రతీ పీహెచ్‌సీలో స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది.
- జీవనశైలిలో మార్పుల కారణంగా..
జీవనశైలిలో మార్పుల కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలతో పాటు అనేక ఇతర వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. వాటిని నియంత్రించి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందిస్తే బాగుంటుందని ప్రభుత్వం హెల్త్‌మిషన్-100 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగు దశలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు. మొదటి దశలో ఈనెల 31 వరకు స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో గైనకాలజీ, పీడియట్రిక్, ఆర్థోపెడిక్, డెంటల్ వైద్య నిపుణులు ఉంటారు. ఈ దశలో వ్యాధులను గుర్తించి మందులతో నయం చేస్తారు. రెండో దశ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు షుగర్, బీపీ, క్యాన్సర్ వంటి స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు మలేరియా, డెంగీ, వడదెబ్బ, టీబీ వంటి జబ్బులను గుర్తించి చికిత్స అందించనున్నారు. నాలుగో దశలో మే 16 నుంచి జూన్ 12 వరకు పట్టణ, గిరిజన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలిక్లినిక్‌లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
- ప్రయోగాత్మకంగా మహిళా సంఘాలకు..
హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వ్యాధి నిర్ధారణ ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా జిల్లా లోని ఐదు మండలాల సంఘాలను ఎంపిక చేశారు. అందులో కెరమెరి, కౌటాల, లింగాపూర్, పెంచికల్‌పేట, రెబ్బెన మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 2,499 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 27,674 మంది సభ్యులు ఉన్నారు. ముందుగా వీరందరికి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయనున్నారు. అందుకోసం డీఆర్‌డీఏ శాఖకు ఈ ఆరోగ్యం అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో ఏపీవోలు మహిళా సంఘాల సభ్యుల పేర్లను నమోదు చేస్తారు. నమోదు చేసిన వారిలో ప్రతీ రోజు 40 నుంచి 50 మంది చొప్పున మండలంలోని పీహెచ్‌సీలో వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయిస్తారు. 32 రకా ల పరీక్షలు చేసి మందులు ఇచ్చి పంపిస్తారు. కానీ మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతుండడంతో సంబంధిత పరీక్షలు చేసి మందులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హెల్త్‌మిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం..
- సీతారాం, జిల్లా వైద్యాధికారి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హెల్త్ మిషన్-100 కార్యక్రమాన్ని విజయవతం చేసేం దు కు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పీహెచ్ సీలలో స్పెషాలిటీ వైద్య శిబిరాలు నిర్వహిస్తు న్నాం. జిల్లాలోని 15 పీహెచ్‌సీల్లో వైద్య శిబిరాలు పూర్త య్యాయి. ఎస్‌హెచ్‌జీ మహిళలకు త్వరలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.