kumaram bheem asifabad- తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:07 PM
జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ప్రతీరోజు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో బుధవారం పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రీడ్ అధికారులతో తాగు నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలె త్తకుండా ప్రతీరోజు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో బుధవారం పంచాయతీరాజ్, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రీడ్ అధికారులతో తాగు నీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా చేయాలని చెప్పారు. ఏ గ్రామంలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16 నుంచి డిసెంబరు 31 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ప్రతీబోర్, సింగల్ ఫేజ్ మోటార్, ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రిడ్ పైపులైన్ల పనులను పరిశీలించాలని చెప్పారు. మరమ్మత్తులు ఉన్నట్ల్లయితే వెంటనే చేపట్టాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి సమస్య రాకుండా యుద్ద ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, మిషన్ భగీరథ ఈఈలు రాకేష్, ఎంఎఎం సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థికశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ సాంక్షన్‌లపై అన్ని శాఖల డీడీవోలు అవగాహన కలిగి ఉండి అయా అంశాలపై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం అన్ని ప్రభుత్వ శాఖల డీడీవోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఆర్థికశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ సాంక్షన్ విభాగాల ద్వారా కాగితరహిత కార్యకలపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విభాగాల నిర్వహణపై అందిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ అంశలపై గురు, శుక్రవారాల్లో మండలస్థాయి డీడీవోఓలకు అవగాహన కల్పించనునానమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజనశాఖ అధికారి హమీత్‌షాఖాన్, డీడీవోలు తదితరులు పాల్గొన్నారు.