Share News

kumaram bheem asifabad-ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:12 PM

ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందలా చూడాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌తో కలిసి మండల అభివృద్దిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పెండింగ్‌ సమస్యలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad-ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి
సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందలా చూడాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌తో కలిసి మండల అభివృద్దిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పెండింగ్‌ సమస్యలపై అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల కింద విడుదలైన నిధులతో అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టేట్టు చూడాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచింలచారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీవారు. సమావేశంలో తహసీల్దార్‌ మధూకర్‌, ఎంపీడీవో ఉజ్వల్‌ కుమార్‌, ఏడీఏ మనోహర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో పలువురి చేరిక

ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ సమక్షంలో శుక్రవారం బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి దుర్గం ప్రవీణ్‌తో పాటు మరో 60 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నీ వర్గాల వారికి సముచి స్థానం కల్పిస్తోందన్నారు. అర్హులైన నిరూపేదలకు ఇందిరమ్మ ఇళ్లు దశల వారిగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుండటంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చయయూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు, డక్కలి సంఘం జిల్లా అధ్యక్షుడు జడల శంకర్‌, వార్డు సభ్యుడు ముక్రం హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 11:12 PM