Share News

ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:55 PM

డ్రగ్స్‌కు నోచెప్పి ఆరోగ్య కరమైన జీవితాన్ని ఆశ్వాదించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంద ర్భంగా డీసీపీ భాస్కర్‌, సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో 2కేరన్‌ నిర్వ హించగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలక్రైం, జూన్‌26 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌కు నోచెప్పి ఆరోగ్య కరమైన జీవితాన్ని ఆశ్వాదించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సంద ర్భంగా డీసీపీ భాస్కర్‌, సీఐ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో 2కేరన్‌ నిర్వ హించగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ గంజాయి, ఇతర మారకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించే ఉద్దేశంతో 2కే రన్‌ నిర్వహించామన్నారు. మంచిర్యాల బా లు ర పాఠశాలల మైదానం నుంచి ఐబీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలి సి 2కే రన్‌ నిర్వహించారు. అనంతరం డీసీపీ భాస్కర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, గంజాయిరహిత లక్ష్యంగా చర్యలు చేపడతామన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలలో వివిధశాఖల అధికారులు, పోలీసులు, యువత విద్యార్థులు పెద్ద సం ఖ్యలోపాల్గొని డ్రగ్స్‌ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లా మన్నారు. మారకద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని ము ఖ్యంగా నేటి యువత వాటి భారినపడకుండా ప్రతి ఒక్కరు అప్రమ త్తంగా ఉండాలని సూచించారు. అనుమానం వస్తే వందకు లేదా 1908కు సమాచారం అందించి గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 10:55 PM