kumaram bheem asifabad- తీరని కష్టం.. అనుమతుల్లో జాప్యం
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:17 PM
జిల్లాలోని అటవీ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయా యి. కేంద్ర అటవీశాఖ అనుమతులు కావాలని అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో జిల్లా పరిధిలో ఏజెన్సీ ఏరియాలో రోడ్లు పనులు మందుకు సాగడంలేదు. గ్రామాల మధ్య అనుసంధానం కలగాలంటే ప్రధానంగా రోడ్ల కనెక్టివిటీ పెరగాలి. అయితే ఎప్పుడో వేసిన రోడ్డు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డంతా గుంతలమయంగా మారడం తో ప్రయాణికులు తీవ్రఅవస్థలు పడుతున్నారు
- అన్నింటికీ అటవీశాఖ అభ్యంతరమే కారణం
బెజ్జూరు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అటవీ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయా యి. కేంద్ర అటవీశాఖ అనుమతులు కావాలని అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో జిల్లా పరిధిలో ఏజెన్సీ ఏరియాలో రోడ్లు పనులు మందుకు సాగడంలేదు. గ్రామాల మధ్య అనుసంధానం కలగాలంటే ప్రధానంగా రోడ్ల కనెక్టివిటీ పెరగాలి. అయితే ఎప్పుడో వేసిన రోడ్డు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో రోడ్డంతా గుంతలమయంగా మారడం తో ప్రయాణికులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. సలుగుపల్లి- పెంచికలపేట మధ్య కేవలం 15 కిలో మీటర్ల దూరమే అయినా ఆ రోడ్డుపై సుమారు 300వరకు గుంతలు ఉన్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం నరకప్రాయంగా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా బెజ్జూరు నుంచి వివిధ అవసరాల నిమిత్తం కాగజ్‌నగర్‌కు వెళ్లాలంటే ఈ రోడ్డుమార్గాన్ని అనుసరిస్తారు. తెలం గాణ ఏర్పాటు అనంతరం తొలి ఏడాదిలో సలుగుపల్లి -పెంచికలపేట మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణం చేపట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. 15కిలోమీటర్ల రోడ్డుపై పూర్తిగా గుంతలు పడడంతో రాకపోకలకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నా రు. ఈ రోడ్డుపై వాహనాలు ప్రయాణించేటప్పుడు గంటకుపైగా సమ యం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఫ మూడేళ్ల క్రితం..
మూడేళ్ల క్రితం సలుగుపల్లి-పెంచికలపేట మధ్య రోడ్డు నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం మావోయి స్టు ప్రాభల్య నిధుల కింద రూ.10 కోట్లు మంజూరు చేసింది. అటవీ అనుమతులు లేవనే కారణంగా రోడ్డు పనులు చేపట్టలేదు. దీంతో నిధులు మంజూరైనా పనులు చేపట్టలేకపోవడంతో ప్రజలకు గుంతలు పడ్డ రోడ్లుపై రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గుంతలపడ్డ రోడ్లపై రాకపోకలు సాగిస్తుండడంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాపో తున్నారు. నిత్యం ఈ రోడ్డుపై ప్రయాణికులు ఇటు కాగజ్‌నగర్‌కు అటు దహెగాం, మంచిర్యాలకు రాకపో కలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు రెండు జిల్లాలకు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాంతంలో ఎవరైనా వ్యాధుల బారిన పడితే మంచిర్యాలకు ఆసుపత్రులకు వెళ్లేందుకు ఈ మార్గం దగ్గరగా ఉంటుంది. దీంతో ప్రతినిత్యం ఈ రోడ్డు మార్గాన రద్దీ కూడా అధికంగా ఉంటుంది. కానీ అటవీ అనుమ తులు లేక రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. గతంలో రోడ్డు నిర్మాణానికి మంజూరైన రూ.10కోట్లు పనులు ప్రారంభించక పోవడంతో మూడు నెలల క్రితం వెనక్కి మళ్లాయి. వర్షాకాలం అనంతరం ప్రజలు పడుతున్న కష్టాలను చూసి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ రోడ్డుపై శ్రమదానంతో మొరంపోసి గుంతలను పూడ్చారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి సలుగుపల్లి-పెంచికలపేట మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.