kumaram bheem asifabad- ప్రభుత్వ భూముల కబ్జా
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:47 PM
జిల్లాలోని పలు చోట్ల ప్రభుత్వ భూములు అక్రమా ర్కులు కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నా అధికారులు అటువైపు కన్నెత్త చూడ డం లేదని వాపోతున్నారు. కాగజ్‌నగర్ సర్‌సిల్క్ శిశుమందిర్ పాఠశాల సమీపంలో గల సర్వేనం బరు 85లోని 13 ఎకరాల్లో కొన్నాళ్ల క్రితం వెంచర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ పక్కనే ఉన్న సర్వే నంబరు 79, 80లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కూడా ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టారన్న ఆరోణలున్నాయి.
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- ముఖ్యమంత్రి కార్యాలయంలో కాగజ్‌నగర్ వాసి ఫిర్యాదు
- కలెక్టర్ పర్యటనతో తేలనున్న వ్యవహారం
కాగజ్‌నగర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు చోట్ల ప్రభుత్వ భూములు అక్రమా ర్కులు కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నా అధికారులు అటువైపు కన్నెత్త చూడ డం లేదని వాపోతున్నారు. కాగజ్‌నగర్ సర్‌సిల్క్ శిశుమందిర్ పాఠశాల సమీపంలో గల సర్వేనం బరు 85లోని 13 ఎకరాల్లో కొన్నాళ్ల క్రితం వెంచర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ పక్కనే ఉన్న సర్వే నంబరు 79, 80లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కూడా ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టారన్న ఆరోణలున్నాయి. ఈ వ్యవహారంపై కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీశైలం అనే వ్యక్తి ఆధారా లతో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయ డంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అప్రమ త్తమైంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం కాగజ్‌నగర్ సర్‌సిల్క్ ఏరియాలో సర్వేనంబరు 79, 80 భూములు ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ ఈ భూముల్లో ప్లాట్లు చేయడం, ప్రహరీగోడ కట్టి అమ్మకానికి పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరకాష్టగా మారుతోంది. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతు న్నారు.
- రెండు రోజుల క్రితం..
రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్ కోసిని సర్వే నంబరు 79, 80లో కలెక్టర్ కె హరిత స్వయం గా ఈ భూములను పరిశీలించారు. సర్వేలు చేపట్టి ప్రభుత్వ భూములకు హద్దులు వేయాలని ఆదేశిం చడంతో ఇప్పుడు హడావుడి మొదలైంది. కబ్జాదా రులకు నోటీసులు పంపించేందుకు అంతా సిద్ధం చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన శ్రీశైలం సమాచార హక్కు చట్టం కింద కాగజ్‌నగర్ కోసిని సర్వేనం బరు 79, 80 ప్రభుత్వకి సంబంధించిన వివరాలు సమర్పించాలని కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాల యంలో దరఖాస్తు చేయగా, అధికారులు తేదీ 12-06-2026న ఆర్‌సీ నంబరు బి/311/2026 సంబంధిత దరఖాస్తుదారుడికి కాగజ్‌నగర్ తహసీ ల్దార్ కార్యాలయం నుంచి సమాచారం అంద జేశారు. ఈ సమాచారంలో ప్రధానంగా సర్వే నంబరు 79లో ప్లాటింగ్ చేసి ఇచ్చినట్టు, అలాగే సర్వేనెంబరు 80లో 1.16 ఎకరాలు ప్రహారీ గోడ కట్టినట్టు స్పష్టంగా రాసి, మ్యాప్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేయడం, ప్రహారీ గోడ కట్టడంపై కలెక్టర్‌తో పాటు ముఖ్యమంత్రికి నేరుగా ఈ ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
- రూ. కోట్ల విలువైన..
కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జాకు గుర వుతున్నా అధికారులు దృష్టి సారించక పోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్వయంగా పర్యటిస్తే తప్పా ఇక్కడి అఽధికారులు స్పందించక పోవడంపై కాగజ్‌నగర్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడి అధికారులు తీరుపై ఇప్పుడు బాహాటంగా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే కాక కాగజ్‌నగర్ చెక్ పోస్టు సమీపంలో కూడా ప్రధాన కాల్వను కబ్జా చేసి దుకాణాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణంపై ఎలా అనుమతులు ఇచ్చారని కాగజ్‌నగర్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంత వరకు పట్టించుకున్న పాపన పోలేదు. ఈ దారిలోనే నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తున్నా ఈ దుకాణం వైపు కన్నెత్తి చూడక పోవడం చర్చనీయాంశంగా మారింది. కాగజ్‌నగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పెద్ద మురికి కాల్వను కూడా కబ్జా చేసి దుకాణా లను నిర్మించారు. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్న కూడా బుట్ట దాఖాలవుతున్నాయని, చర్యలు మాత్రం ఉండడం లేదని చెబుతన్నారు. మూడు నెలల క్రితం కూడా కాగజ్‌నగర్ మండలం ఈసుగాంలో కూడా పోలీస్‌స్టేషన్‌లో సమీపంలో కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అలాగే సిర్పూరు(టి), కౌటాల, బెజ్జూరు, చింతల మానేపల్లి మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా కూడా కొంత మంది నాయకుల అండ దండలతో కబ్జాలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో కూడా ఇదే వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూము లను కబ్జా చేసే వారిపై కఠినంగా చర్యలు చేప ట్టాలని ప్రజలు కోరుతున్నారు.