Share News

kumaram bheem asifabad-ఉపాధి కూలీలకు వంద రోజుల పని కల్పించాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 10:46 PM

ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కల్పించానలి డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. గోయగాం గ్రామ పంచాయతీ పరిధిలోని భీమన్‌గొంది గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాద్లడుతూ జాబ్‌ కార్డుదారులందరికి వంద రోజుల పని కల్పించానల్నారు

kumaram bheem asifabad-ఉపాధి కూలీలకు వంద రోజుల పని కల్పించాలి
ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న డీఆర్‌డీవో దత్తారావు

కెరమెరి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కల్పించానలి డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. గోయగాం గ్రామ పంచాయతీ పరిధిలోని భీమన్‌గొంది గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాద్లడుతూ జాబ్‌ కార్డుదారులందరికి వంద రోజుల పని కల్పించానల్నారు. పని నిర్దేశిత కొలతల ప్రకారం చేసి ప్రతి రోజు రూ.307 వేతనం పొందాలని ఆదేశించారు. పని జరుగుతున్న రోజులలో తప్పకుండా పనికి వెళ్లాలని సూచించారు. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినట్లయితే స్థానిక ఉపాధి హామీ సిబ్బందికి తెలుపాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సాయిరాంగౌడ్‌, ఏపీవో మల్లయ్య, కార్యదర్శి మురళీ, సర్పంచ్‌ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

పనులను వేగవంతం చేయాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసేందుకు కూలీల సంఖ్య పెంచాలని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో బుచ్చన్నలతో కలిసి జిల్లాలోని ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలో గల టీఏలు, ఎఫ్‌ఏలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో పని చేసే కూలీల సంఖ్య పెంచాలన్నారు. వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు ఉపాధి కల్పించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో 100 మందికి పైగా కూలీలకు పని ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం ద్వారా కూలీల హాజరును పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి అలసత్వం లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఈజీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2026 | 10:46 PM