Share News

మున్సిపాలిటీలో ఉపాధి పనులు కల్పించాలి

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:31 PM

చెన్నూరు మున్సిపాలిటీలో ఉ పాధి హామీ పనులను కల్పించాలని కోరుతూ సోమవారం చెన్నూరులోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నా యకులు ధర్నా నిర్వహించారు.

మున్సిపాలిటీలో ఉపాధి పనులు కల్పించాలి
సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా

చెన్నూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు మున్సిపాలిటీలో ఉ పాధి హామీ పనులను కల్పించాలని కోరుతూ సోమవారం చెన్నూరులోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నా యకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఉపాధి హామీ పనులు కల్పిస్తామని హామీ ఇ చ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామిని అమలు చేయడం లేదన్నారు. ఒక పక్క ఎల్‌నినో ప్రభావంతో వరి, పత్తి సాగు సగానికి పడి పోయి వ్యవసాయ కూలీలకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. ము న్సిపాలిటీల్లో ఉపాధి పనులు లేకపోవడంతో నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులను కల్పిం చాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘంజిల్లా కా ర్యదర్శి కనికారపు అశోక్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాస ప్రకాష్‌, నాయకులు సంజీవ్‌, స త్యం, కృష్ణమాచారి, ఉమారాణి, సమ్మక్క, యామిని, రేణుక, నాగజ్యోతి, మారన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:31 PM