గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:34 PM
ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకా శాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధికారులను కోరారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యో తి) : ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకా శాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధికారులను కోరారు. అచ్చం పేట నియోజకవర్గంలోని అన్ని మండ లాల ఎంపీడీవోలు, ఏపీవోలు, సాంకేతిక సహా యకులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ ప థకం ద్వారా అవసరమైన పనులను గుర్తించి ప్రజలకు ఎక్కువగా ఉపాధి లభించేలా ప్రణా ళిక రూపొందించాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా అండగా నిలిచే విధంగా ప నుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని అధికారు లను ఆదేశించారు.
కట్ట అనంతరెడ్డికి పరామర్శ
ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పా ర్టీ మండల మాజీ అధ్యక్షుడు, డీసీసీ ఉపాధ్య క్షుడు కట్ట అనంతరెడ్డి రోడ్డుప్రమాదంలో గాయ పడి హైద్రాబాద్‌లో సాగర్ రింగ్ రోడ్డు సమీ పంలో అగస్త్య హాస్పిటల్‌లో చికిత్స పొందు తుండగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం అక్కడికి వెళ్లి పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకు న్నారు. వైద్యులతో మాట్లాడారు.