కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి
ABN , Publish Date - May 05 , 2026 | 11:30 PM
జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం కింద పనులు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్/ ఊర్కొండ/ తాడూరు, మే 5 (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకం కింద పనులు కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న ఫీడర్ చానల్ పూడిక తీసే పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు, ప నుల స్థితిగతులపై వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఉదయం 6గంటలకే ఉపాధి హామీ పని ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీవో చిన్నఓబులేష్, మండల అధికా రులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించాలి : కలెక్టర్
ప్రభుత్వ నిబంధనల మేరకు ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం తెల్లవారు జామున 6 గంటలకు మండలంలోని ఊర్కొం డపేట, ముచ్చర్లపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటిం చారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలి స్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఊర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడాకారులు, మార్నింగ్ వాకర్స్‌తో కొద్దిసేపు ము చ్చటించారు. ముచ్చర్లపల్లి గ్రామంలోని ప్రాథ మిక పాఠశాలను సందర్శించగా గ్రామస్థులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి సదు పాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారు లను ఆదేశించారు. అంతకు ముందు ఊర్కొండపేట అభ యాంజనేయస్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కలెక్టర్ వెంట కల్వకు ర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, హౌసింగ్ పీడీ సంగప్ప తహసీల్దార్ యూ సుఫ్ అలీ, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి సర్పంచులు రషీద్, వినీత రెడ్డి, మంజుల ఉన్నారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గో డౌన్‌ను మంగళవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను అధికారికంగా తెరిచి అందులో భద్రపరి చిన ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు తదితర ఎన్నికల సామగ్రిని గదుల వారీగా పరిశీలించారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీజేపీ నాగేంద్ర గౌడ్, బీఆర్‌ఎస్ వెంకటయ్య, వైఎస్‌ఆర్‌సీపీ ఎండీ హుస్సేన్, బీఎస్పీ రామకృష్ణ, సీపీఐ శివ శంకర్, టీడీపీ బాలకృష్ణ పాల్గొన్నారు.
అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అ న్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ సమా వేశ మందిరంలో జిల్లాలోని అటవీ ప్రాంత భూ ముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్స్, చెంచు లకు కల్పించే పునరావాస గ్రామాల అభివృద్ధి ప నులపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్‌చంద్రతో కలిసి కలె క్టర్ హేమంత కేశవ్ పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ భూ ముల సర్వే, సరిహద్దుల నవీకరణ వంటి అంశా లపై రెవెన్యూ అటవీ శాఖలు సంయుక్తంగా ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజల్లో అవగా హన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వ హించాలని, అటవీ వనరులను సంరక్షించడం లో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంపొందిం చాలని కలెక్టర్ సూచించారు. ఈ సమా వేశంలో పీడీ డీఆర్‌డీఏ చిన్న ఓబులేష్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ విజయ్‌కుమార్, మిషన్ భగీరథ అధికారులు, కొల్లాపూర్, అచ్చంపేట ఆర్డీవోలు, తహసీల్దార్లు, అటవీశాఖ అధికా రులు పాల్గొన్నారు.