Share News

kumaram bheem asifabad-నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:02 PM

విద్యావంతులైన నిరుద్యోగ యువత నైపున్యాభి వృద్ధి ద్వారా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిరుద్యోగ యువతీ యువకులకు ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్కెటర్‌ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువత జీవితంలో స్థిరపడాలంటే నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవాలని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి స్థాయిలో జీతాలు అందిస్తున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

kumaram bheem asifabad-నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యావంతులైన నిరుద్యోగ యువత నైపున్యాభి వృద్ధి ద్వారా ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిరుద్యోగ యువతీ యువకులకు ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్కెటర్‌ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువత జీవితంలో స్థిరపడాలంటే నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవాలని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి స్థాయిలో జీతాలు అందిస్తున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ యువతకు ద్విచక్ర వాహనాల రిపేరింగ్‌, సెలఫోన్‌ రిపేరింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, హౌజ్‌ వైరింగ్‌, ప్లంబింగ్‌, శానిటరీ, కంప్యూటర్‌, ట్యాలీ, బ్యూటీ పార్లర్‌, మగ్గం పనులు, జ్యూట్‌ బ్యాగుల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా గ్రామాలలో, పట్టణాలలో ఉపాధి పొందవచ్చని తెలిపారు. ప్రధాన మంతి ఇంటర్న్‌ షిప్‌ పథకం గోడ ప్రతులను ఆవిష్కరించారు. జిల్లా మైనార్టీ గురుకుల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో మంచి ప్రతిభ కనేబర్చిన వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారులు రమాదేవి, అశోక్‌, సురేష్‌, నదీప్‌, జిల్లా గ్రామీనాభివృద్ధి అధికారి దత్తారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:02 PM