kumaram bheem asifabad- వేసవిలో ఆదివాసీలకు ఉపాధి
ABN , Publish Date - May 12 , 2026 | 10:08 PM
జిల్లాలోని మారు మూల ప్రాంతాల అడవి బిడ్డలు వేసవిలో అటవీ ఉత్పత్తుల సేకరణతో ఉపాధి పొందుతు ్నారు. అడవే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీలు తమ సంప్ర దాయ అటవీ ఉత్పత్తులను మరవడం లేదు. ఇప్పపూలు, జీడి గింజలు, తునికాకు, తునికి పండ్లు, మొర్రి పండ్లు, పాల పలుకు లు అందిస్తూ వారిని కొంత ఆర్థికంగా బలపడేలా చేస్తోంది. వాటిని సేకరించేందుకు ఆదివాసీలు వేకువజా మునే నిద్ర లేచి పిల్లా పాపలతో కలిసి అడవి బాట పడుతున్నా రు.
- వేకువజామునే అడవిబాట
- ఇప్పపూలు, పాల, మొర్రి, తునికి పండ్లు సేకరణ
ఆసిఫాబాద్: మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారు మూల ప్రాంతాల అడవి బిడ్డలు వేసవిలో అటవీ ఉత్పత్తుల సేకరణతో ఉపాధి పొందుతు ్నారు. అడవే ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీలు తమ సంప్ర దాయ అటవీ ఉత్పత్తులను మరవడం లేదు. ఇప్పపూలు, జీడి గింజలు, తునికాకు, తునికి పండ్లు, మొర్రి పండ్లు, పాల పలుకు లు అందిస్తూ వారిని కొంత ఆర్థికంగా బలపడేలా చేస్తోంది. వాటిని సేకరించేందుకు ఆదివాసీలు వేకువజా మునే నిద్ర లేచి పిల్లా పాపలతో కలిసి అడవి బాట పడుతున్నా రు. అటవీ ప్రాంతాల్లో ఈ సీజన్‌లో పలు రకాల పండ్లు లభిస్తాయి. సమీప గ్రామాల్లోని గిరిజనులు తెల్లవారు జామున అడవికి వెళ్లి సేకరించి గ్రామాల్లో విక్రయిస్తారు. పాల, మొర్రి, తునికి, ఇప్ప పువ్వులతో పాటు తునికాకు, చీపురు పుల్లలను సేకరిస్తారు. మండు వేసవిలో సహజసిద్ధంగా లభించే అడవి పండ్లు అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నాయి.
- ప్రకృతి పరంగా..
ప్రకృతి పరంగా లభ్యమయే ఇలాంటి పండ్లు పట్టణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియదు. అడ వులు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో మాత్రం నెల రోజుల పాటు వీటి విక్రయాలు జోరుగా సాగుతాయి. వీటిలో ఉండే పోషక విలువల గురించి తెలిసిన పల్లె జనం వీటిని కొనుగోలు చేస్తుంటారు. మనం తినే అన్ని ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇలాంటి సమ ుంలో ఇటీవల కాలంలో చాలా మంది ఎలాంటి క్రిమి సంహారక రసాయనాలు వాడని ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని వాంకిడి, కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, బెజ్జూరు, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, పెంచికలపేట మండలాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో వేసవి కాలంలో అటవీ పండ్లతో పాటు తునికాకు, చీపురు లాంటి అటవీ ఉత్పత్తులను గిరిజనులు నెల రోజుల పాటు సేకరించి ఆదాయం పొందుతున్నా రు. అటవీ ప్రాంతంలో పాలపండ్లు, మొర్రిపండ్లు, విత్తనం మొర్రి పలుకులు(సార పప్పు), తునికి పండ్లు, ఇప్పపువ్వు విరివిగా లభ్యమవుతుంటాయి.
- గిరిజనులకు ఆదాయ వనరు..
అటవీ ప్రాంతంలో లభించే పలు రకాల పండ్లు, అటవీ ఉత్పత్తులు గిరిజనులుకు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. అటవీ ప్రాంతంలో సేకరించిన వీటిని సాయంత్రం వేళల్లో సమీప గ్రామాల్లో, మండల కేంద్రాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వేసవి కాలంలో సుమారు 45 రోజుల పాటు లభించే ఈ అటవీ ఉత్పత్తులను గిరిజనులు సేకరించి రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు సంపాధించుకుంటున్నారు. కాగా గిరిజనులు తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో గ్రామాల సమీపంలో అడవికి వెళ్లి వివిధ రకాల పండ్లు సేకరించే క్రమంలో ప్రమాదాల బారిన పడిన సంఘటనలు సైతం చోటు చేసుకుంటాయి. పండ్లను సేకరిస్తున్న క్రమంలో ఒక్కో సారి అడవి పందులు, ఎలుగుబంట్లు, పాముల నుంచి ప్రమాదాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో పలువురు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. పండ్లను తెంపే సమయంలో చెట్లపై నుంచి పడి పోయి గాయాల పాలవుతుంటారు. కాగా క్రమేణ అడవులు తగ్గి పోతుండడంతో వివిధ రకాల పండ్లు కూడా దొరకడం లేదు. దీంతో అనేక వ్యయ ప్రయాసాలకు కోర్చి సేకరించిన పలు రకాల పండ్లను చిన్న గ్లాస్‌కు రూ.20నుంచి30, వాటర్ గ్లాస్‌కు రూ.50తో కాస్త ఎక్కువే ధరకే విక్రయిస్తున్నారు. అయినప్పటికీ కొద్ది రోజుల పాటు సహజసిద్ధంగా లభించే ఈ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుండడంతో జనం కొనుగోలు చేస్తున్నారు.
వేసవిలో ఉపాధి లభిస్తుంది..
- ఆత్రం భీము, తిర్యాణి
వేసవికాలంలో అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులతో గిరిజనులకు ఉపాధి లభిస్తున్నది. తెల్లవారుజామునే అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ లభించే సహజ సిద్దమైన పండ్లు తీసుకు వచ్చి విక్రయిస్తుంటాం. దీంతో రోజుకు రూ.300ల నుంచి రూ.500 మేరకు ఆదాయం లభిస్తుంది.