కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన..
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:27 PM
పెన్షప్ వి ద్రోహ దినం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల స మస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మం గళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట టీజీఈ జే ఎసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ఽధరించి నిరసన తెలి యజేశారు.
నస్పూర్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పెన్షప్ వి ద్రోహ దినం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల స మస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మం గళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట టీజీఈ జే ఎసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ఽధరించి నిరసన తెలి యజేశారు. అంతకు ముందు ప్రధాన రహదారి నుం చి ఉరేగింపుగా కలెక్టరేట్‌కు ఉద్యోలు తరలివచ్చారు. ఉ ద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినా దాలు చేశారు. జేఎసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ 2004 సెప్టెంబరు నుంచి నియామకం అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మా రిందన్నారు. సీపీఎస్ విధానం వలన ఉద్యోగుల కుటుం బాలు రోడ్డున పడి చిన్నాభిన్నం అవుతాయన్నారు. ప్ర భుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని తొలగించి పాత ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ఆందో ళనలో జేఏసీ నాయకులు వనజా రెడ్డి, బాబురావు, రాం మోహన్‌రావు, సంజీవ్, సత్యనారాయణ, రవి, శ్రావణ్ కుమార్, జయకృష్ణ పాల్గొన్నారు.