Share News

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 27 , 2026 | 10:43 PM

సుదీర్ఘకాలం గా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పె న్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘా ల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధాన రహదారి కమాన్‌ నుంచి ఉరేగింపుగా తరలివచ్చి కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఉరేగింపుగా తరలివస్తున్న ఉద్యోగులు

ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆందోళన ...

కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ జేఏసీ మహాఽ ధర్నా..

నస్పూర్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : సుదీర్ఘకాలం గా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పె న్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘా ల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రధాన రహదారి కమాన్‌ నుంచి ఉరేగింపుగా తరలివచ్చి కలెక్టరేట్‌ ఎదు ట ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన హక్కుల సాధనకు ఆందోళనను ఉదృతం చేస్తామని ఉద్యోగు లు నినాదాలు చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా ఆందోళన చేపట్టారు. రెండవ పీఆర్‌ సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల, పె న్షనర్లకు హెల్త్‌ స్కీం తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని, ఉద్యోగ సంఘా లు, అసోసియేషన్లకు తగిన గుర్తింపు కల్పించాలని, సీ పీఎస్‌ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ఫ్లకార్డులను ప్రదర్శించారు. తమ న్యాయమైన సమస్య లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా జేఏసీ జిల్లా చైర్మన్‌ గడి యారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డిలు మా ట్లాడుతూ ఉద్యోగ , ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమ స్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నయన్నారు. ఉ ద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరి ష్కరించాలని, ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చిం చాలన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘాలన్నీ ఐక్యంగా కలిసి కట్టుగా కృషి చేయా లన్నారు. ఈ మహా ధర్నాలో అందరి ఆమోదయోగ్యం తో ఏకగ్రీవంగా ఆమోదం చేసి ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఉద్యోగుల ఆర్థిక సా మాజిక సేవా ప్రయోజనాలకు సంబంధించిన సమస్య లను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలన్నారు. న్యా యమైన హక్కుల పరిష్కారానికి ప్రభుత్వం ఉద్యోగుల తో వెంటనే చర్చలు జరుపాలన్నారు. ప్రభుత్వం నుంచి ఏలాంటి స్పందన రాని పక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ ను ప్రకటించి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చ రించారు. ఈ ఆందోళనలో ఉద్యోగ సంఘాల ప్రతినిధు లు శ్రీనివాస్‌ దేశ్‌ పాండే, శ్రీపతి బాపురావు, రాసపల్లి రవి, పొడేటి సంజీవ్‌, రాజవేణు, రామ్‌ కుమార్‌, తిరు పతి, గంగాధర్‌, వెంకటరమణ, వెంకటస్వామి, సతీష్‌ కుమార్‌, జయకృష్ణ, బాలకృష్ణ, జగన్‌, ప్రభాకర్‌, మల్ల య్య, మనోజ్‌లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు, జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 10:43 PM