ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:44 PM
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ భావండ్ల వెంక టేశ్ డిమాండ్ చేశారు.
- ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ భావండ్ల వెంకటేశ్
నాగర్‌కర్నూల్ టౌన్/ కల్వకుర్తి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా జేఏసీ చైర్మన్ భావండ్ల వెంక టేశ్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాగర్‌కర్నూల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏల ను వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్ సీని అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మహా ధర్నాలో జేఏసీ ప్రధాన కార్య దర్శి రాజశేఖర్‌రావు, అదనపు కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, శ్రీధర్‌శర్మ, శ్రీధర్‌రావు, వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జి ల్లా అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తిలో టీజీ ఈజే ఏసీ ఎన్నచెర్ల సురేష్‌గౌడ్ ఆధ్వ ర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు ధర్నా ని ర్వహించారు. టీజీ ఈజేఏసీ కల్వకుర్తి డివిజన్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో మహబూబ్‌నగర్ చౌర స్తాలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఉ ద్యోగులు, ఉపాధ్యాయులు, నాయకులు తదిత రులు పాల్గొన్నారు.