Share News

ఎమిరేట్స్‌ విమాన సర్వీసులను పెంచండి

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:14 AM

హైదరాబాద్‌ నుంచి ఎమిరేట్స్‌ విమాన సర్వీసులను మరిన్ని పెంచాల ని ఆ సంస్థ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సర్హాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

ఎమిరేట్స్‌ విమాన సర్వీసులను పెంచండి

  1. ఆ సంస్థ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌

  2. స్పోర్ట్స్‌ వర్సిటీలో క్రీడాకారుల శిక్షణకు స్పాన్సర్‌షిప్‌ చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి ఎమిరేట్స్‌ విమాన సర్వీసులను మరిన్ని పెంచాల ని ఆ సంస్థ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సర్హాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఎమిరేట్స్‌ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సర్హాన్‌ శనివారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కాబోతున్న నేపథ్యం లో అక్కడ కూడా ఎమిరేట్స్‌ ఎంఆర్‌వో ఆపరేషన్స్‌ కొనసాగించాలన్నారు. విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ యూనివర్సిటీలోని క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షి్‌పకు ముందుకురావాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. సర్హాన్‌ సానుకూలంగా స్పందించారు. కాగా, హైదరాబాద్‌లో ఎమిరేట్స్‌ ఏ-380 సర్వీసులను ప్రారంభించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jul 12 , 2026 | 06:15 AM