kumaram bheem asifabad- అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:04 PM
జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గల దేశం మనదని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కువ ఓటర్లు కలిగిన దేశమన్నారు. స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటును వినియోగించుటున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు చైతన్య వంతంగా తమ ఓటును వినియోగించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): ఓటు మా జన్మ హక్కు అని తహసీల్దార్ రహీముద్దీన్ అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ నెల 25న జరిగే ఓటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు మా జన్మ హక్కు అని ఓటు ఉన్న ఎవరు కూడా వృధా చేయవద్దన్నారు. ఈ నెల 25న జరిగే ఓటరు దినోత్సవాన్ని పండగ రూపంలో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ బక్కయ్య, ఎంఆర్‌ఐ ప్రవీణ్, స్వప్న, జూనియర్ అసిస్టెంట్ వేణు, ఇమ్రాన్‌ఖాన్, ఏపీఎం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
దహెగాం (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని డీటీ గణేష్ అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ఈ నెల 25న జాతీయ ఓటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మధుకర్, సుగుణాకర్, నాయకులు ధనుంజయ్, రమేష్, చందుగౌడ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు