నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం: ఏలేటి
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:08 AM
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీటెక్, ఎంటెక్ విద్యార్థులు...
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీటెక్, ఎంటెక్ విద్యార్థులు కూడా కానిస్టేబుల్ పోస్టుల కోసం పోటీపడుతున్న పరిస్థితిల్లో స్ర్కీనింగ్ పేరిట అభ్యర్థులను తగ్గించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని, వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగ నియామకాలకు చెందిన జీవో 46పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 19వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేంతవరకు, వయో పరిమితి పెంచేంత వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.