Share News

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:22 PM

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుం డా అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కోరారు.

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలి
విద్యుత్‌, హౌసింగ్‌ అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జనవరి 20 (ఆంధ్రజ్యో తి) : విద్యుత్‌ సమస్యలు తలెత్తకుం డా అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఇప్పటికే అ వసరమైన సబ్‌ స్టేషన్లు, ట్రాన్స్‌ఫా ర్మర్లను మంజూరు చేశామని పేర్కొ న్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మంగళ వారం విద్యుత్‌, హౌసింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ నియోజకవర్గంలో మొదటి విడత ఇందిర మ్మ ఇళ్ల పనులు నిర్ణీత కాలంలో పూర్తికావాల ని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కల్వకుర్తి ఎంపీడీవో ఎన్‌.వెంకట్రాములు, ముని సిపల్‌ కమిషనర్‌ మహమ్మద్‌ షేక్‌, ఏఈ శ్రీని వాస్‌నాయక్‌, నాయకులు సంజీవ్‌కుమార్‌ యా దవ్‌, అశోక్‌రెడ్డి, భూపతిరెడ్డి, షానవాజ్‌ ఖాన్‌, విజయకుమార్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, నియోజ కవర్గంలోని పలువురు ఎంపీడీ వోలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:22 PM