Share News

విద్యుత్‌ లైన్‌మన్‌ సస్పెన్షన్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:27 AM

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని డీ సైకిల్‌ ఏరియా టీజీ ఎస్‌పీడీసీఎల్‌ (విద్యుత్‌ శాఖ- ఆఫరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) లైన్‌మన్‌ జిల్లపల్లి శ్రీనివాస్‌ రూ.45 వేల అవినీతికి పాల్పడినందున గురువారం సస్పెండ్‌ చేస్తూ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి ఉత్తర్వులు జారీచేశారు.

విద్యుత్‌ లైన్‌మన్‌ సస్పెన్షన్‌

చౌటుప్పల్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని డీ సైకిల్‌ ఏరియా టీజీ ఎస్‌పీడీసీఎల్‌ (విద్యుత్‌ శాఖ- ఆఫరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) లైన్‌మన్‌ జిల్లపల్లి శ్రీనివాస్‌ రూ.45 వేల అవినీతికి పాల్పడినందున గురువారం సస్పెండ్‌ చేస్తూ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి ఉత్తర్వులు జారీచేశారు. వినియోగదారుడికి 5-హెచ్‌పీ లోడ్‌ కోసం 3-ఫేస్‌ విద్యుత్‌ లైన్‌ను మంజూరు చేయి స్తానని రూ.45 వేలు లంచంగా శ్రీనివాస్‌ తీసుకున్నా రని విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్‌ అధి కారులు నిర్వహించిన విచారణలో లైన్‌మెన్‌ శ్రీనివాస్‌ రూ.45 వేలను వినియోగదారుడి నుంచి లంచంగా తీసుకున్నట్టు నిర్థారణ జరిగింది. అవినీతి రుజువు కావడంతో శ్రీనివాస్‌ను సీఈ సస్సెం డ్‌ చేశారు. కాగా, 2007 నుంచి శ్రీనివాస్‌ చౌటుప్పల్‌ లో పని చేస్తున్నారు. అందులో సంస్థాన్‌నారాయణపురం మండలం వావిళ్లపల్లిలో 2013 నుంచి 2017 వరకు లైన్‌మన్‌గా పనిచేసి మళ్లీ చౌటుప్పల్‌కు పోస్టింగ్‌ వేయించుకున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:27 AM