kumaram bheem asifabad- విద్యుత్ ప్రమాదాలను నివారించాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 10:37 PM
జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణ దిశగా సమన్వయంతో కృషి చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం విద్యుత్ శాఖ సీఈ అశోక్‌తో కలిసి కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యుత్ శాఖ అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణ దిశగా సమన్వయంతో కృషి చేయాలని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం విద్యుత్ శాఖ సీఈ అశోక్‌తో కలిసి కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యుత్ శాఖ అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని చెప్పారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రంలో రూ.3.99 కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం, కెరమెరి మండలం ధనోరాలో రూ.2.30కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం, ఆసిఫాబాద్ మండలం వావుదాంలో రూ.2.64కోట్లతో 33/11 విద్యుత్ ఉప కేంద్రం, చింతలమానేపల్లి మండలం గూడెంలో రూ.2.32 కోట్లతో 33/11 విద్యుత ఉప కేంద్రం, జిల్లా కేంద్రంలో రూ.కోటితో విద్యుత్ సబ్‌స్టార్, రూ.1.70 కోట్లతో సూపరిం టెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో వంగిన, విరిగిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలు, జనసంచార ప్రాంతాలలో గల ట్రాన్స్‌ఫార్మర్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల నివారణ దిశగా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ ఉత్తం జాడే, రాజన్న, డీఈఈలు, ఎస్‌ఏఓలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏవోలు తదితరులు పాల్గొన్నారు.